ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్ టెల్... మరో ఆఫర్ ని ప్రవేశపెట్టింది. జియోతో పోటిపడేందుకు ఎయిర్ టెల్ ఈ ఆఫర్ ని వినియోగదారుల ముందుకు తీసుకువచ్చింది. జియో అందిస్తున్న రూ.198 ప్లాన్ కి పోటీగా.. రూ.199 ప్లాన్ ని గతంలో తీసుకురాగా.. తాజాగా ఆ ప్లాన్ ని అప్ డేట్ చేసింది.

గతంలో జియో.. రూ.198 ప్లాన్, ఎయిర్ టెల్ రూ.199ప్లాన్.. రెండూ.. రోజుకి 1జీబీ డేటా 28 రోజుల వ్యాలిడిటీతో అందించేవి. కాగా.. ఇటీవల జియో.. తన 198 ప్లాన్ ని అప్ డేట్ చేసంది. రోజుకి 2జీబీ డేటా చొప్పున.. 28 రోజుల వ్యాలిడిటీతో మొత్తం 56జీబీ డేటాను ఇవ్వనున్నట్లు ప్రకటించింది. దీంతో..  ఎయిర్ టెల్ కూడా తన రూ.199 ప్లాన్ ని రివైజ్ చేసింది. రోజుకి 1.4జీబీ డేటా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. 28 రోజుల వ్యాలిడిటీతో మొత్తం 39.2 జీబీ అందివ్వనున్నట్లు తెలిపింది. దీంతోపాటు అన్ లిమిటెడ్ లోకల్, ఎస్టీడీ కాల్స్, ఎస్ఎంఎస్ లు చేసుకునే సదుపాయం కూడా ఉంది.