జియోకి మరో షాకిచ్చిన ఎయిర్ టెల్..

Airtel's New Rs 49 Prepaid Recharge Plan Offers 3GB Data. Details Here
Highlights

రూ.49కే 3జీబీ డేటా

ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్ టెల్  మరోసారి జియోకి షాకిచ్చింది. కష్టమర్లను ఆకట్టుకునేందుకు ఎయిర్ టెల్ మరో ప్రీపెయిడ్ ప్లాన్ ని ప్రవేశపెట్టింది. రూ.49కే 3జీబీ డేటాను అందిస్తున్నట్లు ప్రకటించింది. రూ.49తో రీచార్జి చేసుకుంటే వినియోగదారులకు 3జీబీ 4జీ డేటా లభిస్తుంది. కాగా ఈ ప్లాన్ వాలిడిటీ కేవలం ఒక్క రోజు మాత్రమే. అయితే ఈ ప్లాన్ కేవలం ఎంపిక చేసిన సర్కిల్స్‌లో ఉన్న కస్టమర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. దీన్ని ఎలా తెలుసుకోవాలంటే.. ఎయిర్‌టెల్ యాప్ ఓపెన్ చేసి అందులో ప్లాన్ల వివరాలను చూసుకోవాలి. వాటిల్లో రూ.49కి 3జీబీ డేటా అని ఉంటుంది. ప్లాన్ అందుబాటులో లేకపోతే రూ.49కు కేవలం 1జీబీ డేటా మాత్రమే వస్తుంది. ఇక మరో వైపు జియోలో రూ.49కు 1జీబీ డేటా మాత్రమే లభిస్తుండగా, ఇందులో అన్‌లిమిటెల్ కాల్స్, 50 ఉచిత ఎస్‌ఎంఎస్‌లు కూడా వస్తాయి. ఈ ప్లాన్ వాలిడిటీ 28 రోజులుగా ఉంది. 

loader