ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్ టెల్... వినియోగదారుల కోసం మరోసారి క్యాష్ బ్యాక్ ఆఫర్ ని తీసుకువచ్చింది. ఇప్పటికే తక్కువ ధరకే మొబైల్ డేటా.. అన్ లిమిటెడ్ కాల్స్ అందిస్తున్న ఎయిర్ టెల్.. తాజాగా క్యాష్ బ్యాక్ ఆఫర్ ప్రకటించింది. శామ్ సంగ్ జే సిరీస్ మొబైల్స్ కొనుగోలు చేసిన వారికి ఈ క్యాష్ బ్యాక్ ఆఫర్ వర్తిస్తుంది. శామ్ సంగ్ జే2, శామ్ సంగ్ జే5 ప్రైమ్, శామ్ సంగ్ జే7ప్రో  ఫోన్లలో ఏదో ఒకటి కొనుగోలు చేసిన ఎయిర్ టెల్ కస్టమర్లకు రూ.1500 క్యాష్ బ్యాక్ ఇస్తానని ఎయిర్ టెల్ ప్రకటించింది.

కాకపోతే.. కస్టమర్లు... ఫోన్ కొనుగోలు చేసిన దగ్గర నుంచి సంవత్సరం పాటు రూ.2,500 రీఛార్జ్ చేసుకోవాలి. అప్పుడు ఎయిర్ టెల్ రూ.300 క్యాష్ బ్యాక్ చేస్తుంది. రెండో సంవత్సరం కూడా రూ.2,500తో రీఛార్జ్ చేసుకుంటే అప్పుడు ఎయిర్ టెల్ రూ.1200 క్యాష్ బ్యాక్ అందజేస్తుంది. దీంతో మొత్తం 1500 క్యాష్ బ్యాక్ కస్టమర్ కి అందుతుంది.