Asianet News TeluguAsianet News Telugu

ఇసుక కోసం పార్టీ మారిన వైసిపి ఎమ్మెల్యే ఎవరు?

ఆంధ్రప్రదేశ్ లో ఇసుక బంగాారు. పేదల పేరు చెప్పి తెలుగుదేశం ప్రభుత్వం ఇసుక ఉచితం అని  ప్రకటించింది.  ఉచితం అంటే అధికార పార్టీ నాయకులకే. దీనితో వైసిపిలో ఉంటే లాభం లేదని, పెన్నానది ఇసుక కోసం వైసిపి ఎమ్మెల్యే  ఆదినారాయణ రెడ్డి టిడిపిలో చేరారని ప్రతిపక్ష పార్టీ ఆరోపించింది. చివరకు బ్రాహ్మణి స్టీల్ లో ఇనుమంతా అమ్ముకున్నారని కూడా వైసిసి ఆరోపించింది. డాక్టర్ సుధీర్ రెడ్డిని 2019లో ఆది మీద నిలబెట్టాలని నిర్ణయించారు.

adinarayana reddy defected to ruling party only to benefit from sand illegally

ఇటీవల  మంత్రి అయిన వైసిసి ఎమ్మెల్యే  ఆదినారాయణరెడ్డి ఎందుకు ఫిరాయించారు.తననుగెలిపించిన పార్టీని ఎందుకు అంత సులభంగా వదిలేశారు,

దీనికి వైసిపి నేతలు ఆలస్యంగా వివరణ ఇచ్చారు.

ఆంధ్రప్రదేశ్ లో ఇసుక బంగాారు. పేదల పేరు చెప్పి తెలుగుదేశం ప్రభుత్వం ఇసుక ఉచితం అని  ప్రకటించింది.  ఉచితం అంటే అధికార పార్టీ నాయకులకే. దీనితో వైసిపిలో ఉంటే లాభం లేదని, పెన్నానది ఇసుక కోసం వైసిపి ఎమ్మెల్యే  ఆదినారాయణ రెడ్డి టిడిపిలో చేరారని ప్రతిపక్ష పార్టీ ఆరోపించింది.ఇపుడు కోట్లు కురిపించే పెన్నఇసుక సామ్రాజ్యానికి రారాజు అతనే, అని వైౌసిపి నేతలు జమ్మలమడుగులో జరిగిన పార్టీ సదస్సులో చెప్పారు.మంత్రికి వ్యతిరేకంగా క్యాంపెయిన్ నిర్వహించాలని సభలో వైసిసి నాయకులు నిర్ణయించారు.

 

చివరకు ఆగిపోయిన  ‘బ్రాహ్మణి స్టీల్’ లో ఇనుమంతా అమ్ముకున్నారని కూడా వైసిసి ఆరోపించింది. 

 

వైసిపికి వెన్నుపోటు పొడిచి టిడిపిలోచేరి మంత్రి పదవిపొందిన ఆదినారాయణరెడ్డిని 2019లో జమ్మలమడుగు అసెంబ్లీనియోజకవర్గం నుంచి వోడించేందుకు వైసిపి నేతలు  శపథం చేశారు.  జమ్మలమడుగులోని అలంకార్ ఫంక్షన్ హాల్లో  జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి అధ్యక్షతన ప్లీనరీ సమావే శం జరిగింది. అదినారాయణ రెడ్డి మీద పోటీకి జగన్ అభ్యర్థిని కూడా ఖరారు చేశారు. ఆయన పేరు డాక్టర్‌ సుధీర్‌రెడ్డి. ఈ విషయాన్నిసభలో ఎంపి అవినాశ్ రెడ్డి వెల్లడించారు.

 

ఈ ప్రాంతరైతులకు నారాయణరెడ్డి చేసిందేమీలేదని అంటూ 2012 శనగకు రైతులకు ఇన్సురెన్స్‌ కూడా ఇప్పించలేకపోయారు.చిత్తశుద్ధి ఉంటే పెండింగులో ఉన్న 2012 నాటి శనగ ఇన్సురెన్స్‌ రైతులకు ఇప్పించాలన్నాలని సవాల్ విసిరారు.సమావేశంలో టిడిపినేత రామసుబ్బారెడ్డికి సానుభూతి లభించింది.

 

‘జమ్మలమడుగులో టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీ ని నమ్ముకుని ఉన్న రామసుబ్బారెడ్డిని, ఆయన వర్గం నాయకులను చంద్రబాబు కుటుంబం మోసం చేసింది,’ వక్తలు చెప్పారు. మహానాడులో ప్రజలకు ఉపయోగపడే తీర్మానాలు ఏమీ చేయలేదన్నారు. పా ర్టీ నేత దుగ్గాయపల్లె మల్లికార్జునరెడ్డి మాట్లాడు తూ 2019 ఎన్నికల్లో మంత్రి ఆదినారాయణరెడ్డి అపజయం తప్పదన్నారు.

 

Follow Us:
Download App:
  • android
  • ios