గ్లోబల్ ఎక్స్ లెన్సీ అవార్డు అందుకున్న పవన్

First Published 17, Nov 2017, 4:46 PM IST
actor and janasena party president pawan kalyan got global excellence award
Highlights
  • గ్లోబల్ ఎక్స్ లెన్స్ అవార్డు అందుకున్న పవన్
  • లండన్ లో పర్యటిస్తున్న పవన్

సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శుక్రవారం లండన్ లో గ్లోబల్ ఎక్స్ లెన్సీ అవార్డును అందుకున్నారు. ప్రఖ్యాత ఇండో యూరోపియన్ బిజినెస్ ఫోరమ్ ఆయనకు ఈ  అవార్డు అందజేసింది. గ్లోబల్‌ ఎక్స్‌ లెన్స్‌ అవార్డు అందుకున్న తర్వాత పవన్ పలు కార్యక్రమంలో పాల్గొననున్నారు. గ్లోబల్‌ ఇన్వెస్టిమెంట్‌ మీట్‌ న్యూ ఇండియా సదస్సులో భాగంగా ‘భారత్‌లో పెట్టుబడులకు అవకాశాలు’ అనే అంశంపై ప్రసంగిస్తారు.

యూరప్‌ యూనివర్సిటీలకు చెందిన విద్యార్థులతోనూ సమావేశం అవుతారు. పవన్‌ పర్యటన ఏర్పాట్లను ఐఈబీఎఫ్‌ నిర్వాహకులు, యూరప్‌లోని జనసేన కార్యకర్తలు, అభిమానులు పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా పవన్‌కల్యాణ్‌ను ఆయన అభిమానులు కలిశారు. కొద్దిసేపు ఆయనతో ముచ్చటించారు.

శ్రీకాకుళం జిల్లా ఉద్దాణం కిడ్నీ బాధితుల సమస్య పరిష్కారానికి పవన్ బాగా కృషి చేశారు. పవన్ కారణంగానే ప్రభుత్వం ఈ సమస్యపై దృష్టిసారించి పరిష్కార దిశగా అడుగులు వేస్తోంది. ఇందుకు గాను పవన్ కి ఇండో యూరోపియన్ బిజినెస్ ఫోరమ్.. ఈ అవార్డును అందజేసింది.

 

loader