Asianet News TeluguAsianet News Telugu

విశాఖలో ఎసిబి అధికారుల మీదకు కుక్కలను ఉసి గొల్పాడు

గణేశ్వరరావు రెవిన్యూ శాఖలో చెయిన్ మన్ గా జీవితం ప్రారంభించి డిప్యూటీ సర్వే ఇన్స్ పెక్టర్ దాకా ఇలా ఎదిగాడు. తప్పుడు పత్రాలు సృష్టించడం లో దిట్ట. అలాంటి అవసరమున్న వారంతా ఆయనను ఆశ్రయించే వారు.

ACB raid on gedela houses in vizag yields numerous illegal assets

ఆ మధ్య సంచలనం సృష్టించిన విశాఖ భూ కుంభకోణం నిందితుడు మాజీ సర్వేయర్  గేదెల లక్ష్మి గణేశ్వరరావు ఆస్తులపై శనివారం నాడు ఎసిబి అధికారులు దాడులు జరిపి భారీగా అక్రమాస్తులను కనుగొన్నారు. ఇంట్లోకి ప్రవేశించేందుకు ఎసిబి అధికారులు, గణేశ్వరావు  దంపతులతోనే కాదు, కుక్కలతో కూడా పోరాడాల్సి వచ్చింది.  ఇదెమిటో చూడండి.

ఈ రోజు ఉత్తరాంధ్ర జిల్లాలలో తపాటు, తూర్పు పశ్చిమగోదావరి జిల్లాలు, హైదరాబాద్ లో ని పలుప్రదేశాలలో గణేశ్వరరావు, ఆయన బినామీల ఆస్తుల మీద ఎసిబి అధికారులు ఏక కాలంలో దాడులు నిర్వహించి అతగాడు వేనకేసిన ఆస్తులు చూసి నివ్వెర పోయారు.విశాఖ సీతంపేట రామాటాకీస్ఖ సమీపంలో బందువుల పేట గెదెల అయిదంతస్థుల భనవం నిర్మిస్తున్నాడని ఏసిబికి సమాచారం అందింది. దీని మీద దాడులు జరిగాయి. ఇదే విధంగా శ్రీనగర్ లోని సువర్ణ రెసిడెన్సీ 3 వ అంతస్థు, 303 మ ఫ్లాట్ లో ఎసిబి డిఎస్ పి రమాదేవి నాయకత్వంలో అధికారులు సోదాలు ప్రారంభించారు. అయితే, ఇంట్లోకి వెళ్లేందుకు అధికారులు పెద్ద ఎత్తున పోట్లాడాల్సి వచ్చింది. మొదట ఎసిబి అధికారులను గణేశ్వరరావు దంపతులు లోపలకు రానీయలేదు. లోపలి నుంచి గడియ వేసుకుని అడ్డుకున్నారు. ఎసిబి అధికారులు తలపులు పగులగొట్టే పని చేయడంతో గత్యంతరం లేక తలుపు తీశారు. ఇక్కడి తో కథ ముగియలేదు.  తర్వాత గణేశ్వరరావు అధికారుల మీదకు ఎదురు దాడికి దిగాడు. అధికారులు తన ఏడమ భుజం పై కోట్టారనిదీనితో తన భుజానికి గాయమయిందని ఆరోపించారు. ఈ దశలో గణేశ్వరరావు కుమారుడు  రంగ ప్రవేశం చేసి తన రెండుకుక్కలను ఎసిబి అధికారుల మీద ఉసి గొల్పాడు. ఈ పరిస్థితి  రావడంతో ఎసిబి అధికారులు పోలీసుల సహాయం తీసుకున్నారు. ఎసిబి డిఎస్ పి ఫిర్యాదు చేయడంతో 4వ పట్టణ సిఐ రాంబాబు ఆధ్వర్యంలో పోలీసుల వచ్చి ఎసిబి అధికారులకు రక్షణ కల్పించారు.  రోజు జరిపిన దాడిలో భారీగా వెండి సామాగ్రి, బంగారు అభరణాలు, అస్తి పత్రాలు, బ్యాంకు పాస్ పుస్తకాలు, విదేశీ కరెన్సీ,రద్దయిన నోట్లు, ఖరీదయిన చీరెలు లభించాయి. చోడవరం ఎంపిపి భర్త  గూలూరు వెంకటసత్యనారాయణ అలియాస్ పెద్దబాబుకు సంబంధించిన ల్యాండ్ డాక్యుమెంట్లు గణేశ్వరరావు ఇంట్లో దొరకడం శనివారం దాడుల విశేషమని ఎసిబి అధికారులు చెబుతున్నారు. తర్వాత విజయ నగరంలోఉన్న ఆస్తుల  మీద కూడా ఎసిబి అధికారులు దాడుల జరిపారు. అక్కడి నుంచి విలువయిన పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.

గణేశ్వరరావు రెవిన్యూ శాఖలో చెయిన్ మన్ గా జీవితం ప్రారంభించి రెవిన్యూ ఇన్స్ పెక్టర్ దాకా ఇలా ఎదిగాడు. తప్పుడు పత్రాలు సృష్టించడం లో దిట్ట కావడంతో అలాంటి అవసరమున్న వారంతా ఆయనను ఆశ్రయించే వారు. ఆయన మీద వచ్చిన తీవ్రమయిన ఆరోపణల్లో సింహాచలం  గుడి భూములు కాజేసేందుకు నకిలీ డాక్యుమెంట్లు తయారు చేయడం ఒకటి.  అనేక భూ అక్రమాల కేసులలో ఇరుక్కుని సిట్ విచారణలో దొరికి   గత ఏడాది ఆగస్టులో అరెస్టుయి, జైలుకు పోయిన ఈ పెద్ద మనిషి ఈ మధ్యే బెయిల మీద వచ్చారు.