అవినతీ గురించి ఆప్ పై ఆరోపించటానికి ప్రత్యర్ధులకు అవకాశం లేకపోవటం కేజ్రీవాల్ కు బాగా కలసి వస్తోంది.

ఎన్నికల్లో కేజ్రీవాల్ దూసుకుపోతున్నట్లే కనబడుతోంది. ఓటర్లపై గట్టి ప్రభావం చూపే విదంగా మాట్లాడుతున్నారు. ఫిబ్రవరిలో జరుగనున్న ఎన్నికల్లో పోటీ చేసేందుకు తమ వద్ద పైసా కూడా లేదని చెప్పటం ఆశ్చర్యమే.

పంజాబ్, గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మి పార్టీ మంచి ఫలితాలు సాధిస్తుందని అందరూ అనుకుంటున్నారు. పంజాబ్ లో అయితే, విజయం సాధించినా ఆశ్చర్యంలేదన్నట్లుగా ఇంతకాలం వెలువడిన సర్వేలు చెప్పాయి.

అయితే, తాజాగా కేజ్రీవాల్ మాట్లాడుతూ, తమ బ్యాంకు ఖాతాలన్నీ ఖాళీ అయిపోయాయని చెప్పటం గమనార్హం. గోవాలో 28-32 సీట్లు సాధిస్తామని, పంజాబ్ లో తమదే విజయమని చెబుతున్నారు. అయితే, ఎన్నికల్లో పోటీ చేసేందుకు తమ అభ్యర్ధుల వద్ద నయాపైసా కూడా లేదంటున్నారు. డబ్బు ఇచ్చి ఓట్లు కొనటానాకి తమ పార్టీ అవినీతి పార్టీ కాదని గట్టగా ప్రచారం చేస్తున్నారు.

తమ అభ్యర్ధుల వద్ద ఒక్క నయాపైసా కూడా లేదనటం ద్వరా ప్రజలకు కేజ్రివాల్ ఓ విషయం చెప్పదలచుకున్నారు. ఢిల్లీలో రెండు సంవత్సరాలుగా అధికారంలో ఉన్నా తామ ప్రభుత్వం నీతిమంతంగానే పాలన చేస్తున్నట్లు చెబుతున్నారు.

అందుకే తమ వద్ద డబ్బులు లేవంటున్నారు. పోటీ చేస్తున్న పార్టీలన్నింటిలోనూ తమదే నిజాయితీగల పార్టీగా కేజ్రివాల్ బల్లగుద్ది మరీ చెబుతున్నారు.

అదే విషయాలను ఎన్నికల ప్రచార సభల్లో ప్రస్తావిస్తూ మిగిలిన పార్టీలపై ఉన్న అవినీతి అరోపణలను గురించి వివరిస్తున్నారు. ఓటర్లకు కేజ్రీవాల్ తన విధానాలను, పాలనలో సాధించిన విజయాలను స్పష్టంగా వివరిస్తున్నారు. ఈ విధంగా మిగిలిన పార్టీలు ప్రజలకు చెప్పలేకున్నాయి.

దాంతో కేజ్రీవాల్ పాల్గొనే సభలకు జనాలు బాగా ఆకర్షితులవుతున్నట్లు సమాచారం. అవినతీ గురించి ఆప్ పై ఆరోపించటానికి ప్రత్యర్ధులకు అవకాశం లేకపోవటం కేజ్రీవాల్ కు బాగా కలసి వస్తోంది.

ఎన్నికల్లో డబ్బులు లేకపోయినా ప్రజలు తన పాలనను చూసి ఓట్లేయాలని కేజ్రీవాల్ అడగటం పట్ల అందరూ ఆసక్తిగా మాట్లాడుకుంటున్నారు.