400ఏళ్ల తర్వాత తొలిసారిగా ఆ గుడిలోకి మగవాళ్లు

A Temple In Odisha That Has Allowed Men After 400 Years
Highlights

శాప విమోచనం జరిగిందా..?

శబరిమలలో స్త్రీలకు ప్రవేశఉండదు. ఆ ఆలయంలోకి 12ఏళ్లు దాటిన మహిళలను ఆలయంలోకి ప్రవేశించరు.  శబరిమలలోకి మహిళలను అనుమతించాలంటూ న్యాయస్థానంలో కేసుకూడా నడుస్తోంది. ఇది అందరికీ తెలిసిన విషయమే .అయితే ఓ ఆలయంలో మగవారికి ప్రవేశం లేదు. ఆ ఆలయంలో పూజలు కూడా మహిళలే చేస్తారు. అలాంటి ఆలయంలోకి  400 ఏళ్ల తర్వాత తొలిసారిగా పరుషులు ప్రవేశించారు. ఇంతకీ ఆ ఆలయం ఎక్కడ ఉంది..? పురుషులను ఎందుకు రానివ్వలేదు? తెలుసుకోవాలని ఉందా.. ఇంకెందుకు ఆలస్యం చదివేయండి

ఒడిశాలోని ఓ పురాతన ఆలయంలో అరుదైన ఘటన జరిగింది. సాంప్రదాయాలను పక్కన పెట్టి మొదటిసారిగా పురుషులను గుడిలోకి అనుమతించారు. కేంద్రపర జిల్లాలోని ఈ గుడిలోకి 400 ఏళ్లుగా పురుషులకు ప్రవేశం లేదు. అలాంటిది తొలిసారిగా పురుషులకు ప్రవేశం కల్సించడంతో ఇప్పుడు ఈ ఘటన అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.
కేంద్రపార జిల్లాలో సతాభ్యా అనే లంక గ్రామంలో ఉన్న పంచువారాహి అమ్మవారి ఆలయంలో మగవాళ్లకు అనుమతి లేదు.

పెళ్లి అయిన ఐదుగురు దళిత మహిళలు మాత్రమే నిత్యం పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఓ వైపు బంగాళా ఖాతంలో నీటి మట్టం పెరిగిపోతుండటం.. దాని ఒడ్డున్న ఉన్న గ్రామాలకు కూడా ముంపు ముప్పు ఉండటంతో గ్రామాల తరలింపు కార్యక్రమాన్ని ఒడిశా ప్రభుత్వం చేపట్టింది. ఇందులో భాగంగా సతాభ్యా గ్రామాన్ని బాగాపాటియా ప్రాంతానికి తరలించారు. అయితే తమను రక్షిస్తూ వస్తున్న అమ్మవారిని విగ్రహాలను తరలించేందుకు నిర్ణయించారు. ఆ విగ్రహాల తరలింపు ఆ మహిళా పూజారులకు కష్టమవడంతో ఐదుగురు పురుషుల సాయంతో ఏప్రిల్‌ 20న పడవ ద్వారా విగ్రహాలను కొత్త ఆలయానికి తరలించారు. 400 ఏళ్లుగా ఉన్న అచారం బ్రేక్ కావటంతో.. శాప విమోచనం అయ్యిందా అని ప్రజలు చర్చించుకోవటం జరిగింది.

loader