ఇష్టంలేని పెళ్లి చేస్తున్నారని యువకుడి ఆత్మహత్య

A Boy Commits Suicide After Forced Marriage
Highlights

ఇంట్లో వాళ్లు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాద సంఘటన మేడ్చల్ జిల్లా డబిల్ పూర్ గ్రామ శివారులో చోటుచేసుకుంది. 

ఈ విషాద ఘటనకు సంబంధింంచిన వివరాలిలా ఉన్నాయి. తూప్రాన్ సమీపంలోని మనోహరాబాద్‌ మండలం పర్కిబండ గ్రామానికి చెందిన ఎర్కలి భిక్షపతి,పెంటమ్మల పెద్ద కొడుకు నరేష్‌(22). ఇతడు మేడ్చల్‌ సమీపంలోని ఓ ప్రైవేట్‌ పరిశ్రమలో పని చేస్తున్నాడు. ఇతడికి ఇటీవల తల్లిదండ్రులు పెళ్లి నిశ్చయం చేశారు.అయితే ఈ పెళ్లి తనకు ఇష్టం లేదని చెప్పినా తల్లిదండ్రలు బలవంతపెట్టారు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన నరేష్ పనికి  వెళ్తున్నానని ఇంట్లో  చెప్పి డబిల్‌పూర్‌ గ్రామ శివారులో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.  

రైలు పట్టాలపై మృతదేహం పడిఉండడాన్ని గమనించిన స్థానికులు సికింద్రాబాద్‌ రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం అలుముకున్నాయి. కొడుకు మరణంలో తల్లిదండ్రులు  కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

loader