చిన్నారులపై జరుగుతున్న లైంగిక దాడులపై దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తున్న వేళ ఉత్తర ప్రదేశ్ లో మరో చిన్నారిపై లైంగిక దాడి జరిగింది. ఇటీవల కాలంలో ఆసిఫా పై జరిగిన అకృత్యం ఇంకా మరువక ముందే మరో 14 ఏళ్ల చిన్నారిని అత్యాచారం జరగడం తీవ్ర కలకలం సృష్టిస్తోంది. ఈ దుర్ఘటనలో ఓ మహిళ నిందితులకు సహకరించిడం విడ్డూరం.

ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.ఉత్తరప్రదేశ్ లోని కౌశాంబి గ్రామానికి చెందిన ఓ 14 ఏళ్ల చిన్నారిపై బబ్లూ ప్రజాపతి, భయ్యాన్ అనే ఇద్దరు యువకులు కన్నేశారు. ఈ పాపను లొంగదీసుకోడానికి సవిత ప్రజాపతి అనే మహిళ సాయం తీసుకున్నారు. అభం శుభం తెలియని చిన్నారికి మాయమాటలు చెప్పిన సవిత ఈ యువకుల దగ్గరికి తీసుకెళ్లింది. దీంతో చిన్నారిని ఈ ఇద్దరు యువకులు అత్యంత దారుణంగా రేప్ చేశారు. ఒకరి తర్వాత ఒకరు చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడ్డారు. దీంతో పాపం చిన్నారి తీవ్ర అస్వస్థతకు గురయ్యింది.

ఇంటికి వెళ్లిన తర్వాత చిన్నారి తనపై జరిగిన లైంగిక దాడి గురించి తల్లిదండ్రులకు తెలిపింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాధు చేశారు. ఈ ఘటనపై స్పందించిన జిల్లా ఎస్పీ ప్రతాప్ కుమార్ గుప్తా ఇప్పటికే నిందితులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. చిన్నారిపై లైంగింక దాడికి పాల్పడిన బబ్లూ ప్రజాపతి, భయ్యాన్ తొ పాటు వారికి సహకరించిన సవితను కూడా అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. అదేవిధంగా ఈ దాడితో తీవ్ర అస్వస్థతకు గురైన చిన్నారిని వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించినట్లు ఎస్పీ తెలిపారు.