మహారాష్ట్రలో భారీ ఎన్ కౌంటర్, 14 మంది మావోల మృతి

మహారాష్ట్రలో భారీ ఎన్ కౌంటర్, 14 మంది మావోల మృతి

మహరాష్ట్ర లోని గడ్చిరొలి జిల్లాలో భారీ ఎన్ కౌంటర్ జరుగుతోంది. జిల్లాలోని బారఘడ్ సమీపంలోని తాడ్ గావ్ -కసన్ సూర్ అడవిప్రాంతంలో మావోయిస్టుల కదలికలను గుర్తించిన భద్రతా దళాలు వారిపై ఏకకాలంలో దాడికి పాల్పడ్డారు. ఊహించని విధంగా దాడి జరగడంతో మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఈ ఎన్ కౌంటర్ లో పోలీసుల కాల్పుల్లో 14 మంది మావోయిస్టులు మృతిచెందినట్లు సమాచారం. మృతుల్లో మావోయిస్టు అగ్రనాయకులు ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. అయితే మృతుల వివరాలు ఇంకా తెలియరాలేదు. 

భద్రతా బలగాళకు, మావోయిస్టులకు మద్య కాల్పులు కొనసాగుతున్నాయి. దీంతో తెలంగాణ సరిహద్దుల్లో కూడా భద్రతా బళగాలు అప్రమత్తమయ్యాయి. ఇక్కడ సరిహద్దుల్లో కూంబింగ్ కొనసాగుతోంది. ఇలా భద్రతా బలగాలు మావోయిస్టుల ఏరివేతలో గత నాలుగేళ్లలో ఇదే అతిపెద్ద ఆపరేషన్. మావోయిస్టుల నుండి భారీగా ఆయుధాలు లభించే అవకాశం ఉందని మహారాష్ట్ర పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు. దట్టమైన అటవీ ప్రాంతంలో ఎన్ కౌంటర్ కొనసాగుతోందని, కాల్పులు ముగిస్తే గానీ ఈ ఎన్ కైంటర్ కు సంబంధించిన పూర్తి సమాచారం అందుతుందని పోలీసులు చెబుతున్నారు. అయితే ఈ ఎన్ కౌంటర్ లో మావోయిస్టులకు మాత్రం కోలుకోలేని దెబ్బ తగిలింది. 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos