చంద్రబాబుకి దిమ్మతిరిగే షాక్

100 tdp supporters joined in ycp in anantapur district
Highlights

వైసీపీలో చేరిన 100మంది టీడీపీ నేతలు

ఏపీలో టీడీపీ ఆదరణ నెమ్మదిగా తగ్గిపోతోంది. రాష్ట్రానికి హోదా కోసం పోరాడిన ఘనత మొత్తం వైసీపీకే దక్కింది. వైసీపీ ఎంపీలు ఢిల్లీలో హోదా కోసం పోరాడటం.. రాజీనామాలు చేయడం, వారం రోజులపాటు నిరాహార దీక్షలు చేయడంతో.. ప్రజలకు ఆ పార్టీపై నమ్మకం పెరిగింది. అంతేకాకుండా టీడీపీ మొదటి నుంచి హోదా విషయంలో ఒక మాట నిలబడకపోవడం వారికి  వ్యతిరేకంగా మారింది. ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో ఇప్పుడు హోదా గురించి మాట్లాడటం, కేంద్ర ప్రభుత్వం నుంచి విడిపోవడం లాంటివి కూడా చంద్రబాబుకి చేటు తెచ్చాయి. ఎంతలా అంటే.. టీడీపీకి గత ఎన్నికల అత్యధిక మెజార్టీ తెచ్చిపెట్టిన జిల్లాల్లో ఒకటైన అనంతపురం నుంచే వలసలు మొదలయ్యాయి.

 
 శుక్రవారం అనంతపురం జిల్లావాసులు దాదాపు 100మంది టీడీపీ నుంచి వైసీపీలోకి చేరిపోయారు. బొమ్మనహాళ్‌లో శుక్రవారం ఏర్పా టు చేసిన బూత్‌ లెవల్‌ సభ్యుల సమావేశంలో దేవగిరి గ్రామానికి చెందిన ఎంసీహెచ్‌ రాజ్‌కుమార్‌ ఆధ్వర్యంలో రామాంజి, మద్దనీ, ఎర్రిస్వామి, రాము, వెంకటేష్, ఎర్రిస్వామి తదితరులకు వైఎస్సార్‌సీపీ జిల్లా పరిశీలకులు వైఎస్‌ కొండారెడ్డి, మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డిలు కడువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్‌ ఈశ్వరరెడ్డి, నాయకులు చంద్రశేఖర్‌రెడ్డి, సత్యన్న, యోగేశ్వరరెడ్డి, ఎంపీటీసీలు జయరామ్‌రెడ్డి, పరమేశ్వర, ఎల్‌.లోకేష్‌ , ప్రతాప్‌రెడ్డి, బసప్ప, మల్లారెడ్డి, సర్మస్, ఆనంద్, లక్ష్మినారాయణ, తిప్పేస్వామి, కొత్తూరు తిమ్మప్ప, తిప్పేస్వామి, వన్నూరుస్వామి, కృష్ణ, సంగప్ప, దర్గాహొన్నూరు పాల్గొన్నారు.

loader