టొరంటో: టొరంటోలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వ్యాన్ ప్రజలపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో పది మంది మరణించగా, 16 మంది గాయపడ్డారు. ఈ ప్రమాదం సోమవారం సాయంత్రం జరిగింది. 

భోజన విరామసయంలో కార్యాలయ కార్మికులు పెద్ద యెత్తున రోడ్డు మీదికి వచ్చిన సమయంలో ఈ ప్రమాదం సంభవించింది.  దాదాపు 1.6 కిలోమీటర్ల పాదచారులను లక్ష్యం చేస్తూ దూసుకెళ్లింది. వ్యాన్ డ్రైవర్ పోలీసు కస్టడీలో ఉన్నాడు.  సన్నీబ్రూక్ హెల్త్ సెంటర్ లో చికిత్స పొందుతున్న ఐదుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. 

డ్రైవర్ కావాలనే ప్రజలపైకి వ్యాన్ ఎక్కించాడా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కావాలనే డ్రైవర్ దాడి చేశాడా సందేహం వ్యక్తమవుతోంది. ఈ దాడికి కారణమేమై ఉంటుందనే విషయంపై మాట్లాడడానికి కెనడా పబ్లిక్ సేఫ్టీ మినిస్టర్ రాల్ఫ్ గూడాలే నిరాకరించారు. 

దర్యాప్తు జరుగుుతున్నందున ఇప్పుడే ఏమీ చెప్పలేమని అన్నారు. ఏం జరిగింది, ఎలా జరిగింది, దాని వెనక ఉద్దేశం ఏమిటనేది పోలీసుల దర్యాప్తులో తేలుతుందని మీడియా సమావేశంలో అన్నారు.