Narayana Murthy : యువకులు వారానికి 70 గంటలు పని చేయాలి - ఇన్ఫోసిస్ నారాయణమూర్తి
భారతదేశ యువత వారానాకి 70 గంటలు పని చేయాలని పద్మశ్రీ అవార్డు గ్రహీత, ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ ఆర్ నారాయణమూర్తి అన్నారు. అప్పుడే అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలతో భారత్ పోటీ పడుతుందని చెప్పారు.
Narayana Murthy : గడిచిన 2-3 దశాబ్దాల్లో అద్భుతమైన పురోగతి సాధించిన ఆర్థిక వ్యవస్థలతో భారత్ పోటీపడాలంటే యువకులు అంతా వారానికి 70 గంటలు పనిచేయాలని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత ఎన్ ఆర్ నారాయణమూర్తి అభిప్రాయం వ్యక్తం చేశారు. ‘ఇది నా దేశం’ అని యువత భావించి, కష్టపడి పని చేయాలని సూచించారు.
పశ్చిమ బెంగాల్ మంత్రి జ్యోతిప్రియ మల్లిక్ ను అరెస్టు చేసిన ఈడీ.. ఎందుకంటే ?
ఆరిన్ క్యాపిటల్ చైర్మన్ టీవీ మోహన్ దాస్ పాయ్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన 3వన్4 క్యాపిటల్ పాడ్ కాస్ట్ 'ది రికార్డ్' మొదటి ఎపిసోడ్ లో నారాయణ మూర్తి మాట్లాడారు. ఆ మొదటి ఏపిసోడ్ గురువారం విడుదలైంది. ఈ పాడ్ కాస్ట్ లో జరిగిన సంభాషణలో దేశ నిర్మాణం, టెక్నాలజీ, తన కంపెనీ ఇన్ఫోసిస్ తదితర అంశాలపై నారాయణ మూర్తి మాట్లాడారు. నేటి యువతపై ఆయన తన అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశారు.
భారతదేశం పని ఉత్పాదకత ప్రపంచవ్యాప్తంగా అత్యల్పంగా ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చైనా వంటి దేశాలతో పోటీ పడటానికి రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జపాన్, జర్మనీ చేసిన విధంగా మన దేశ యువత కూడా అదనపు గంటలు పని చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.
హమాస్ కు షాక్.. ఇజ్రాయెల్ పై ఆకస్మిక దాడి సూత్రదారులను మట్టుబెట్టిన ఐడీఎఫ్..
భారత్ లో మన పని ఉత్పాదకతను మెరుగుపరుచుకోకపోతే, ప్రభుత్వంలో అవినీతిని ఏదో ఒక స్థాయిలో తగ్గించకపోతే, ఈ నిర్ణయం తీసుకోవడంలో మన బ్యూరోక్రసీలో జాప్యాన్ని తగ్గించకపోతే అద్భుతమైన పురోగతి సాధించిన దేశాలతో మనం పోటీ పడలేమని చెప్పారు. కాబట్టి యువత ‘ఇది నా దేశం’ అని భావిస్తూ.. వారానికి 70 గంటలు పని చేసేందుకు సిద్ధంగా ఉన్నానని చాటి చెప్పాలని కోరారు.