హమాస్ కు షాక్.. ఇజ్రాయెల్ పై ఆకస్మిక దాడి సూత్రదారులను మట్టుబెట్టిన ఐడీఎఫ్..

హమాస్ కు ఇజ్రాయెల్ సైన్యం భారీ షాక్ ఇచ్చింది. ఆ మిలిటెంట్ గ్రూప్ లో కీలకంగా ఉన్న ముగ్గురు సభ్యులను హతమార్చింది. తమ వైమానిక దాడిలో వారు మరణించారని ఐడీఎఫ్ వెల్లడించింది. ఈ ముగ్గురు ఆక్టోబర్ 7వ తేదీన ఇజ్రాయెల్ పై జరిపిన ఆకస్మిక దాడిలో కీలకంగా వ్యవహరించారని పేర్కొంది. 

A shock to Hamas.. The IDF killed the masterminds of the surprise attack on Israel..ISR

ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇజ్రాయిల్ దళాలు, హమాస్ దళాల మధ్య భీకర పోరు జరుగుతోంది. దీంతో రెండు దేశాలకు చెందిన పౌరులు, సైనికులు మరణిస్తున్నారు. దీంతో ఇరు దేశాలకు తీవ్ర నష్టం వాటిళ్లుతోంది. ఇరు దళాల్లో కీలకంగా ఉన్న వ్యక్తులు కూడా తమ ప్రత్యర్థి దళాల చేతిలో హతమవుతున్నారు. తాజాగా హమాస్ దళంలో కీలకంగా ఉన్న ముగ్గురు సీనియర్ ఉగ్రవాదులను ఇజ్రాయిల్ దళాలు మట్టుబెట్టాయి.

పశ్చిమ బెంగాల్ మంత్రి జ్యోతిప్రియ మల్లిక్ ను అరెస్టు చేసిన ఈడీ.. ఎందుకంటే ?

ఈ విషయాన్ని ఐడీఎఫ్ (ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్) అధికారికంగా వెల్లడించింది. దరాజ్ తుఫా బెటాలియన్ లోని ముగ్గురు సీనియర్ హమాస్ ఉగ్రవాదులపై తమ యుద్ధ విమానాలు దాడి చేశాయని శుక్రవారం తెల్లవారుజామున వెల్లడించింది. అక్టోబర్ 7న ఇజ్రాయెల్ పై జరిగిన ఆకస్మిక దాడిలో వీరు కీలక పాత్ర పోషించారని ఇజ్రాయెల్ మిలటరీ తెలిపింది.

హమాస్ ఉగ్రవాద సంస్థలో ఈ ఆపరేషన్లు అత్యంత ముఖ్యమైన బ్రిగేడ్ గా పరిగణిస్తున్నామని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ తెలిపింది. ఈ మేరకు ఐడీఎఫ్ తన అధికారిక ఎక్స్ హ్యాండిల్ లో ఓ పోస్టు పెట్టింది. ‘‘ఐడీఎఫ్ యుద్ధ విమానాలు దరాజ్ తుఫా బెటాలియన్ లోని ముగ్గురు సీనియర్ హమాస్ కార్యకర్తలపై దాడి చేశాయి. అక్టోబర్ 7న ఇజ్రాయెల్ పై జరిగిన దాడి, హంతక దాడిలో బెటాలియన్ ఆపరేటర్లు కీలక పాత్ర పోషించారు. హమాస్ ఉగ్రవాద సంస్థ అత్యంత ముఖ్యమైన బ్రిగేడ్ గా దీనిని పరిగణిస్తున్నాం’’ అని పేర్కొన్నారు.

కాగా.. హతమైన ముగ్గురు ఉగ్రవాదుల ఫొటోలను ఇజ్రాయెల్ మిలిటరీ విడుదల చేసింది. ఇజ్రాయెల్ సెక్యూరిటీ ఏజెన్సీ షిన్ బెట్ కచ్చితమైన ఇంటెలిజెన్స్ మార్గదర్శకత్వంలో హమాస్ ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు సైన్యం తెలిపింది. అంతకు ముందు.. గురువారం జరిగిన వైమానిక దాడుల్లో హమాస్ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ డిప్యూటీ హెడ్ షాదీ బారుద్ హతమైనట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ తెలిపింది. ఇజ్రాయెల్ పై అక్టోబర్ 7న హమాస్ దాడి ప్రణాళికలో ఇతని ప్రమేయం ఉందని ఐడీఎఫ్ తెలిపింది.

ఇదిలా ఉండగా.. ఆశ్రయం, నీరు, ఆహారం, వైద్య సేవల అవసరం ఉన్న నేపథ్యంలో హమాస్ పాలిత ప్రాంతానికి ఇంధనం చేరకపోతే త్వరలోనే గాజాలో కార్యకలాపాలను నిలిపివేయాల్సి వస్తుందని పాలస్తీనా శరణార్థుల కోసం ఐక్యరాజ్యసమితి ఏజెన్సీ యూఎన్ఆర్డబ్ల్యూఏ తెలిపింది. అయితే హమాస్ వద్ద పెద్ద ఎత్తున ఇంధన నిల్వలు ఉన్నాయని, వాటిని ఆసుపత్రులు ఉపయోగించుకోవచ్చని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios