బీజేపీ ఎమ్మెల్యే అధికారిక నివాసంలో యువకుడు ఆత్మహత్య...
లక్నోలోని బీజేపీ ఎమ్మెల్యే యోగేష్ శుక్లా అధికారిక నివాసంలో ఆదివారం రాత్రి 24 ఏళ్ల యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

లక్నో : లక్నోలో ఆదివారం అర్థరాత్రి భారతీయ జనతా పార్టీ (బిజెపి) ఎమ్మెల్యే యోగేష్ శుక్లా అధికారిక నివాసంలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. నగరంలోని హజ్రత్‌గంజ్ ప్రాంతంలో ఉన్న శుక్లా ప్రభుత్వ నివాసంలో ఈ ఘటన జరిగింది. మృతుడిని ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకి జిల్లాలోని హైదర్‌ఘర్‌కు చెందిన 24 ఏళ్ల శ్రేష్ట తివారీగా గుర్తించారు.
లక్నోలోని బక్షి కా తలాబ్ (BKT) అసెంబ్లీ నియోజకవర్గ ప్రతినిధి, ఎమ్మెల్యే యోగేష్ శుక్లాతో సంబంధం ఉన్న మీడియా బృందంలో తివారీ సభ్యుడు. శుక్లాకు చెందిన హజ్రత్‌గంజ్ నివాసంలో ఉరివేసుకుని వేలాడుతున్న శ్రేష్ట తివారీ మృతదేహాన్ని పోలీసు అధికారులు గుర్తించారు.
మహాత్మా గాంధీ జయంతి.. అక్టోబర్ 1న గంట పాటు శ్రమదానం చేయాలని దేశ ప్రజలకు ప్రధాని పిలుపు
కుటుంబకలహాల కారణంగానే యువకుడు ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. తివారీ మరణం వెనక ఉన్న కారణాలను తెలుసుకోవడానికి తదుపరి విచారణ జరుగుతోంది.శ్రేష్ట తివారీ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం పంపామని, ఈ విషయంపై తదుపరి విచారణ జరుగుతోందని పోలీసులు తెలిపారు.
ఇదిలా ఉండగా, నాగ్‌పూర్ లో ఓ షాకింగ్ ఘటన వెలుగు చూసింది. కారు హెడ్‌లైట్ విషయంలో జరిగిన వాదనలో స్టేట్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (ఎస్‌ఆర్‌పిఎఫ్) జవాన్ ఓ 54 ఏళ్ల వ్యక్తిని చెంపదెబ్బ కొట్టాడు. దీంతో అతను మరణించాడని ఆదివారం ఒక అధికారి తెలిపారు. నిందితుడైన జవాన్ ను నిఖిల్ గుప్తా (30)గా గుర్తించారు. అతను తన సోదరిని చూసేందుకు వథోడా పోలీస్ స్టేషన్ పరిధిలోని మాతా మందిర్ ప్రాంతానికి వెళ్లే క్రమంలో గురువారం రాత్రి ఘటనా స్థలానికి చేరుకున్నాడు.
గుప్తా తన కారును పార్క్ చేస్తున్నప్పుడు, కారు హెడ్‌లైట్ బీమ్ అదే ప్రాంతంలో నివసించే బాధితుడు మురళీధర్ రామ్‌రాజీ నెవేర్ ముఖంపై నేరుగా పడుతుందని అధికారి తెలిపారు. దీంతో బాధితుడు మురళీధర్ మర్యాదపూర్వకంగా నిందుతుడైన నిఖిల్ గుప్తాకు కారు హెడ్ లైట్ తగ్గించమని చెప్పాడు. కానీ, ఎస్సార్పీఎఫ్ జవాన్ కోపానికి వచ్చాడు. నాకే చెబుతావా అని విరుచుకుపడ్డాడు. దీంతో ఇది ఇద్దరి మధ్య వాగ్వాదానికి దారితీసింది.
వాదనతో ఆగ్రహానికి వచ్చిన గుప్తా.. నెవర్ ని గట్టిగా కొట్టడంతో నెవేర్ నేలమీద కుప్పకూలిపోయాడు. అతడిని ప్రభుత్వ వైద్య కళాశాల, ఆసుపత్రికి తరలించగా, శనివారం మరణించినట్లు అధికారి తెలిపారు. పోలీసులు గుప్తాపై ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 304 కింద కేసు నమోదు చేసినట్లు అధికారి తెలిపారు.