అంధవిశ్వాసాలు, అనాగరిక తీర్పులు ఇంకా దేశంలో కొన్ని చోట్ల అక్కడక్కడా కనిపిస్తూనే ఉన్నాయి. దీనికి తాజా ఉదాహరణే.. ట్రాక్టర్ నడిపిన ఓ యువతికి గ్రామ బహిష్కరణ విధించడం. ఇది ఝార్ఖండ్ లో చోటు చేసుకుంది. 

ఝార్ఖండ్ : శాస్త్ర,సాంకేతిక రంగాల్లో దేశం దూసుకుపోతుంది. ప్రపంచం అడ్వాన్స్డ్ టెక్నాలజీతో అంతరిక్షాన్ని అందుకుంది. అయినా కొన్ని చోట్ల మూఢనమ్మకాలు ఇంకా పాతుకుపోయే ఉన్నాయి. అమ్మాయిలు అంతరిక్షానికి ఎగురుతున్నా..కొన్ని చోటల వివక్షను ఎదుర్కుంటున్నారు. అమ్మాయి ట్రాక్టర్ నడిపితే అరిష్టం అని, గ్రామానికి చెడు జరుగుతుందని మూఢ విశ్వాసంతో.. ట్రాక్టర్ నడిపిన అమ్మాయిని గ్రామ బహిష్కరణ చేసిన ఘటన ఝార్ఖండ్ లో జరిగింది. 

వివరాల్లోకి వెడితే.. ఓ యువతి ట్రాక్టర్ నడుపుతూ వ్యవసాయం చేస్తోందని.. దీనివల్ల గ్రామానికి చెడు జరుగుతుందని నమ్మిన గ్రామస్తులు.. ఆమెను గ్రామ బహిష్కరణ చేశారు. ఈ ఘటన ఝార్ఖండ్ లోని గుమ్లాలో జరిగింది. శివనాథ్ పూర్ గ్రామానికి చెందిన 22 యేళ్ల మంజు ఓరన్.. కుటుంబ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా వ్యవసాయం చేయడం ప్రారంభంచింది. పాత ట్రాక్టర్ ను కొనుగోలు చేసి.. స్వయంగా పొలాన్ని దున్నుతోంది. దీనిని గమనించిన గ్రామస్థులు.. మహిళ ట్రాక్టర్ నడిపితే చెడు జరుగుతుందని దీనివల్ల గ్రామంలో కరువు వస్తుందని, వెంటనే నిలిపివేయాలని ఆమెను వారించారు. 

పాము ప‌గ‌.. రెండు రోజుల్లో ఇద్ద‌రు అన్న‌ద‌మ్ముల‌ను కాటేసి చంపిన విషస‌ర్పం

అయితే మంజు దీనికి ఒప్పకోలేదు. వ్యవసాయం చేయడం కొనసాగించింది. దీంతో పంచాయతీ నిబంధనలను అతిక్రమించినందుకు మంజును గ్రామ బహిష్కరణ చేయాలని నిర్ణయించారు. మంజు ఓరన్, గ్రామస్థులు చేసిన తీర్మానాన్ని తిరస్కరించింది. వారి తీర్మానాన్ని తాను అంగీకరించబోనని.. వ్యవసాయం చేయడాన్ని కొనసాగిస్తానని స్పష్టం చేసింది.