కాలేజీ ఫీజు కోసం స్నేహితుల సాయం కోరిన యువతి.. హోటల్ లో బంధించి మూడు రోజులు అత్యాచారం
కాలేజీ ఫీజు కట్టడంలో సాయం చేస్తామని చెప్పి ఓ యువతిపై ఇద్దరు దుండుగులు అత్యాచారానికి పాల్పడ్డారు. మూడు రోజుల పాటు ఆమెను హోటల్ గదిలో బంధించి లైంగిక దాడికి ఒడిగట్టారు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటు చేసుకుంది.
తమిళనాడులో దారుణం జరిగింది. కోయంబత్తూరులోని ఓ ప్రైవేట్ కాలేజీలో అండర్ గ్రాడ్యుయేట్ చదువుతున్న ఓ విద్యార్థినిపై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమెను మూడు రోజుల పాటు హోటల్ గదిలో బంధించి లైంగిక దాడికి ఒడిగట్టారు. వారి నుంచి ఎలాగోలా తప్పించుకున్న బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. వారిపై ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
16 ఏళ్ల అమ్మాయిని పెళ్లాడిన 65 ఏళ్ల మేయర్.. వెంటనే అత్తకు ప్రమోషన్..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తమిళనాడులోని నీలగిరి జిల్లాకు చెందిన 20 ఏళ్ల విద్యార్థిని కోయంబత్తూరులోని ఓ ప్రైవేట్ కాలేజీలో డిగ్రీ సెకెండియర్ చదువుతోంది. ఆమె తల్లిదండ్రులు కొంత కాలం కిందట విడిపోయారు. అయితే కాలేజీలో ఫీజు కట్టాల్సి రావడంతో యువతి తన తల్లిని అడిగింది. తాను ఫీజు కట్టబోనని, తండ్రిని అడగాలని ఆమె సూచించింది. దీంతో ఆ విద్యార్థిని తన తండ్రిని కలిసి విషయం చెప్పింది. అతడు కూడా తాను ఫీజు కట్టేందుకు నిరాకరించాడు.
నిస్సాహాయ స్థితిలో ఉన్న యువతి తన కాలేజీ స్నేహితుడికి పరిస్థితి మొత్తం వివరించింది. సాయం చేయాలని కోరింది. అతడి ద్వారా ఆ యువతికి కోయంబత్తూరు జిల్లా కొండయంపాళయంకు చెందిన 22 ఏళ్ల జర్మన్ రాజేష్, పి రవీంద్రన్ లు పరిచయం అయ్యారు. వారిద్దరూ కాలేజీ ఫీజు కడతామని ఆమెకు హామీ ఇచ్చారు. దీంతో ఆ యువతి నమ్మింది. ఆమెను ఏప్రిల్ 23వ తేదీన ఇద్దరు నిందితులు ఓ హోటల్ కు తీసుకెళ్లి బంధించారు. మూడు రోజులు పాటు అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకూడదని ఆమెను బెదిరించారు. అయితే వారి బారి నుంచి బాలిక ఎలాగోలా తప్పించుకుంది.
కర్ణాటకలో ఈసారి బీజేపీ ‘ఆపరేషన్ లోటస్’ పని చేయదు.. కాంగ్రెస్ దే అధికారం - మాజీ మంత్రి ఎంబీ పాటిల్
ఏప్రిల్ 26వ తేదీన మహిళా పోలీసులను ఆశ్రయించింది. తనపై జరిగిన అఘాయిత్యాన్ని వారికి వివరించింది. నిందితులపై ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితులిద్దరిపై భారతీయ శిక్షాస్మృతిలోని 366, 342, 376, 506 (ii) సెక్షన్‌ల కింద కేసు నమోదు చేశారు. దర్యాప్తు ప్రారంభించిన అధికారులు హోటల్ కు వెళ్లి చూడగా..వారు అప్పటికే అక్కడి నుంచి పరారయ్యారు. తరువాత వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గురువారం ఓ ప్రదేశంలో పోలీసులు వారిని కనిబెట్టారు. దీంతో నిందితులు బయపడిపోయి, పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఓ భవనంపై నుంచి దూకడంతో వారి కాళ్లకు గాయాలు అయ్యాయి. నిందితులిద్దరినీ కోయంబత్తూర్ మెడికల్ కాలేజీ హాస్పిటల్ (సీఎంసీహెచ్)లో చేర్చారు. శుక్రవారం సాయంత్రం వీరిని డిశ్చార్జి చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.