Asianet News TeluguAsianet News Telugu

ఫ్రాన్స్‌లో అల్లర్ల కట్టడికి యోగినే సరైన వ్యక్తి.. జర్మనీ ప్రొఫెసర్ ట్వీట్ వైరల్

ఫ్రాన్స్‌లో అల్లర్లను కట్టడి చేయాలంటే సరైన వ్యక్తి యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ అని జర్మనీ ప్రొఫెసర్ ఓ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ వైరల్ అయింది. దీనిపై యూపీ సీఎం కార్యాలయం స్పందించింది.
 

yogi perfect person to control france riots says germany professor kms
Author
First Published Jul 2, 2023, 8:30 PM IST

న్యూఢిల్లీ: ఫ్రాన్స్ గత కొన్ని రోజులుగా అల్లర్లతో అట్టుడుకిపోతున్నది. ముఖ్యంగా ప్యారిస్‌లో అల్లర్లు ఊహించినదానికి మించిపోయాయి. 17 ఏళ్ల యువకుడిని ట్రాఫిక్ పోలీసులు సమీపంగా తుపాకీతో కాల్చి చంపడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ వీడియో వైరల్ కావడంతో చాలా మంది ప్రభుత్వంపై వ్యతిరేకత వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా అల్లర్లకు పాల్పడుతున్నారు. ఈ అల్లర్ల నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యానాథ్‌ను ప్రస్తావిస్తూ ఓ జర్మనీ ప్రొఫెసర్ ట్వీట్ చేయడం సంచలనంగా మారింది.

ప్రొఫెసర్ ఎన్ జాన్ కామ్ అనే పేరుతో ఉన్న ట్విట్టర్ హ్యాండిల్ యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌ను ప్రస్తావించింది. ఫ్రాన్స్‌లో అల్లర్లను కట్టడి చేయడానికి భారత్ తప్పకుండా యోగి ఆదిత్యానాథ్‌ను ఫ్రాన్స్‌కు పంపాలని ఆ ట్విట్టర్ హ్యాండిల్ పేర్కొంది. ఆయన అయితేనే.. ఫ్రాన్స్‌లో 24 గంటల్లో అల్లర్లను అదుపులోకి తేగలడని ట్వీట్ వివరించింది.

యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ కార్యాలయాన్ని ఈ ట్వీట్‌లో ట్యాగ్ చేశారు. దీంతో యోగి ఆదిత్యానాథ్ ఆఫీసు ట్విట్టర్ హ్యాండిల్ ఈ ట్వీట్ పై రియాక్ట్ అయింది. ఎప్పుడైనా, ఎక్కడైనా ప్రపంచంలో తీవ్రవాదం అల్లర్లు, అరాచకాన్ని ప్రేరేపిస్తే, లా అండ్ ఆర్డర్ పరిస్థితులు ప్రపంచంలో ఎక్కడ సమస్యలు ఎదుర్కొన్నా ఈ ప్రపంచం యోగి మోడల్ లా అండ్ ఆర్డర్‌ను గుర్తు చేసుకుంటుందని పేర్కొంది. ఈ లా అండ్ ఆర్డర్ మాడల్‌ను మహారాజ్ జీ స్థాపించారని వివరించింది.

Also Read: సీఎం పక్షపాతం? మణిపూర్ అల్లర్లను ఎగదోసేలా ట్వీట్లు.. కుకీలను హేళన చేస్తూ బీరెన్ సింగ్ వ్యాఖ్యలు

కాగా, ఈ ట్వీట్ పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చీటింగ్ కేసులో అరెస్టయిన ఓ ముద్దాయి డాక్టర్ నరేంద్ర విక్రమాదిత్య యాదవ్ ఈ ట్వీట్‌ను చేసి ఉండొచ్చని అనుమానాలు వచ్చాయి. యోగి మాడల్ అంటే తప్పుడు ఎన్‌కౌంటర్లు, బుల్డోజర్ చర్యలతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే విధానం అని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ పేర్కొన్నారు. కాగా, మరికొందరు.. బీజేపీ ప్రభుత్వానికి విదేశీ ప్రశంసలు అందుకోవాలనే ఆరాటం ఉన్నదని విమర్శించారు.

Follow Us:
Download App:
  • android
  • ios