గిరిజన యువ పర్వతారోహకుడు అమ్గోత్ తుకారాం మరో ఘనత సాధించాడు.  ఆస్ట్రేలియాలోని అత్యంత ఎత్తైన శిఖరాన్ని కొస్సియుస్కో ని తుకారాం అదిరోహించాడు.  ఇప్పటి వరకు చాలా ఘనతలు సాధించిన తుకారాం.. పర్వతారోహణ చేసిన ప్రతిసారీ ఏదో ఒక కారణంతో చేస్తుండటం విశేషం.

తుకారాం ఈసారి  శ్రీ చిన్న జీయర్ స్వామీజీకి చెందిన రిజిస్టర్డ్ ఛారిటీ సంస్థ అయిన జెఇటి హెల్పింగ్ హ్యాండ్స్ ని ఎంచుకున్నాడు. ఇటీవల ఆస్ట్రేలియాలో కారుచిచ్చు రేగిన సంగతి తెలిసిందే. దాని వల్ల ఎన్నో వన్య ప్రాణాలు ప్రాణాలు కోల్పోయాయి. ఈ క్రమంలో దాని గురించి ఓ సందేశం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ పర్వాతరోహణ చేయడం విశేషం. 

Also Read కన్యత్వ పరీక్ష.. పెద్ద కొడుకు గదిలోకి పంపి అత్యాచారం: కోడలి పట్ల అత్త దారుణం...

హోలీ పండగ రోజు తుకారాం ఈ  శిఖరాన్ని అధిరోహించడం విశేషం. తన తోటి ఆస్ట్రేలియన్లతో హోలీ ఆడి ఆ తర్వాత పర్వతాన్ని అదిరోహించాడు. ఈ సందర్భంగా శాంతి మరియు సామరస్యాన్ని ప్రపంచానికి తెలియజేశాడు. 

తుకారాం  నిరంతరం తన  సాహసాలతో  ప్రపంచానికి ఏదో ఒక స్ఫూర్తిని ఇస్తూనే ఉంటాడు. కాగా తుకారం ఆస్ట్రేలియా పర్యటనకు  జెఇటి ఆస్ట్రేలియా ఫౌండేషన్ మరియు శ్రీ చిన్న జెయార్ స్వామీజీకి చెందిన జెఇటి హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థలు సహాయం చేశాయి. 

 ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. చిన్న జీయర్ స్వామి ఎంతో గొప్పవారని ప్రశంసలు కురిపించారు.  ఆయన ఆశీర్వాదంతో తాను మరింత ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా తనకు పూర్తిగా సహకరించిన జెట్ ఆస్ట్రేలియా ఫౌండేషన్, జెట్ హెల్పింగ్ హ్యాండ్స్ జట్లకు ఆయన కృతజ్ఞతలు తెలిపాడు.

ప్రపంచంలోని ఏడు ఎత్తైన శిఖరాల్లో ఐదింటిని తాను అదిరోహించినట్లు ఈ సందర్భంగా తుకారాం చెప్పాడు. 

1. మౌంట్ కిల్లిమంజారో (19,308 అడుగులు) ఆఫ్రికా జూలై 4, 2018 , సందేశం అందరూ హెల్మెట్ వాడండి అని చెబుతూ..
2.Mt.Everest (29,029 అడుగులు) ఆసియా (నేపాల్) మే 22, 2019 ప్రకృతి యొక్క ఐదు అంశాలను రక్షించండి అని సందేశాన్ని ఇచ్చాడు.
3.Mt.Elbrus (18,510 అడుగులు) యూరప్ (రష్యా) జూలై 27, 2019  డ్రగ్స్ నిషేధించాలని కోరుతూ..
4.Mt అకాన్కాగువా (22,837 అడుగులు) అడుగులు, దక్షిణ అమెరికా, 2020 జనవరి 26.
5. మౌంట్ కోస్సియుస్కో ఆస్ట్రేలియా ఖండం ఎత్తైన శిఖరం.