కన్యత్వ పరీక్ష.. పెద్ద కొడుకు గదిలోకి పంపి అత్యాచారం: కోడలి పట్ల అత్త దారుణం
మధ్యప్రదేశ్‌లో దారుణం జరిగింది. కొత్తగా కాపురానికి వచ్చిన కోడలు కన్యో కాదో తెలుసుకోవడానికి అత్తగారు పరీక్ష పెట్టటింది. అయినప్పటికీ సర్దుకుపోయి కాపురం చేస్తున్నా నరకం చూపించింది ఆ అత్త.
వివరాల్లోకి వెళితే... ఇండోర్‌కు చెందిన ఓ మహిళకు 2017 మే 4న ఓ వ్యక్తితతో వివాహమైంది. ఈ క్రమంలో భర్తతో కలిసి హనీమూన్ వెళ్లేందుకు సిద్ధమైంది. అయితే తన కోడలు కన్యో కాదోనని తెలుసుకోవాలనుకున్న అత్తగారు ఆమెను బాత్రూమ్‌లో కన్యత్వ పరీక్ష పెట్టింది.
కోడల్ని బట్టలు విప్పి నిలబడమని చెప్పింది.. ఎందుకు అని అడగ్గా నువ్వు కన్యవో కాదో తెలుసుకోవడానికి అన్ని అత్తగారు చెప్పడంతో కోడలు షాకైంది. వెంటనే ఈ విషయాన్ని భర్తకు చెప్పగా.. పెద్దలు ఏం చేసినా మన మంచికే చేస్తారని చెప్పి, తల్లికి మద్ధతుగా మాట్లాడటంతో ఆమె ఖంగుతింది.
Also Read:పెళ్లి రోజు వాంతులు చేసుకుందని..కన్యత్వ పరీక్ష చేయించిన వరుడు
ఇష్టం లేకున్నా అత్త ముందు నగ్నంగా నిలబడి కన్యత్వ పరీక్షలో నెగ్గి భర్తతో హనీమూన్‌కు వెళ్లింది. ఈ అవమానాన్ని మరచిపోయి సంతోషంగా గడుపుతున్న ఆమె జీవితంలో మళ్లీ అలజడి రేగింది. ఆమె భర్త అన్న (వరుసకు బావ) అసభ్యంగా తాకుతూ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. అత్తగారితో ఈ విషయం చెప్పినట్లుగా ఆమె పట్టించుకోలేదు.
ఈ నేపథ్యంలో 2017, అక్టోబర్ 27వ తేదీన గదిని శుభ్రం చేసే నెపంతో అత్తగారు స్వయంగా కోడలిని పెద్ద కొడుకు గదిలోకి పంపింది. ఇదే అదునుగా భావించిన అతను తలుపులు మూసేసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
బాధితురాలు తనపై జరిగిన దారుణాన్ని అత్తగారికి చెప్పింది. అయితే దీనిపై పెద్ద కొడుకును నిలదీయకపోగా.. తన ఇద్దరు బిడ్డలను సుఖపెట్టే అదృష్టం నీకొచ్చినందుకు సంతోషించాలని.. ఇలాంటి వాటితో కాపురాన్ని నాశనం చేసుకోవద్దని చెప్పడంతో బాధితురాలు కుమిలిపోయింది.
Also Read:తనకు కాబోయే భర్తతో రాఖీ సావంత్ కన్యత్వ పరీక్షలు!
వీరి వేధింపులతో విసిగిపోయిన బాధితురాలు 2017 అక్టోబర్ 28న పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ బాధను తల్లిదండ్రులకు చెప్పుకోలేక తనలో తానే కుమిలిపోయింది. కుమార్తె అత్తగారింటికి తిరిగి వెళ్లడానికి నిరాకరిస్తుండటంతో ఆమె తల్లిదండ్రులకు అనుమానం కలగడంతో నిలదీయగా బాధితురాలు జరిగినదంతా చెప్పింది.
దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన తల్లిదండ్రులు కుమార్తెను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాధతురాలి భర్త, బావ, అత్తలపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.