వావ్.. చంద్రయాన్ -3 ప్రయోగాన్ని విమానంలో నుంచి వీడియో తీసిన ప్రయాణికుడు.. వైరల్
చంద్రయాన్ ప్రయోగాన్ని మనమందరం భూమిపై నుంచే చూశాము. కానీ ఓ యువకుడు ఆ రాకెట్ ను విమానం నుంచి చూశాడు. దానిని అతడు తన సెల్ ఫోన్ లో బంధించాడు. ఆ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
యావత్ భారతదేశం గర్వపడేలా చంద్రయాన్ -3 నిప్పులు చిమ్ముతూ ఆకాశంలోకి దూసుకెళ్లింది. ఈ ప్రయోగాన్ని అనేక మంది భారతీయులు యూట్యూబ్ ద్వారా, టీవీల ద్వారా వీక్షించారు. అవకాశం ఉన్న వారు ఏపీ శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం వద్ద అధికారులు ఏర్పాటు చేసిన గ్యాలరీలో కూర్చొని చూశారు. అయితే ఓ ప్రయాణికుడు ఈ దృష్యాలను విమానం నుంచి ఆస్వాదించాడు. ఆ ఆనందాన్ని అతడు పొందుతూనే తన సెల్ ఫోన్ లో వీడియో కూడా తీశాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
చిరుత అనారోగ్యంగా ఉందని, బైక్ పై ఎక్కించుకొని హాస్పిటల్ కు తీసుకెళ్లిన యువకుడు.. నోరెళ్లబెట్టిన జనం
భారతదేశ మూడో మూన్ మిషన్ చారిత్రాత్మక ప్రయోగాన్ని చెన్నై నుంచి ఢాకాకు ఇండిగో విమానంలో ప్రయాణిస్తున్న ఓ యువకుడు తన సెల్ ఫోన్ లో వీడియో రికార్డు చేశాడు. చంద్రయాన్-3 గంభీరంగా ఎగురుతున్నప్పుడు కిటికీ సీటు నుంచి ఆ దృశ్యాన్ని ఆస్వాదించడమే కాకుండా దాన్ని బంధించాడు. అయితే ఆ అజ్ఞాత ప్రయాణికుడు ఎవరో ఇంత వరకు తెలియనప్పటికీ.. ఆయన రికార్డు చేసిన దృశ్యాలు అందరినీ ఆనందంలో ముంచెత్తుతున్నాయి.
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ( ఇస్రో) శుక్రవారం ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట నుండి చంద్రయాన్-3ని ప్రయోగించింది. ముందుగా నిర్ణయించిన ప్రకారమే మధ్యాహ్నం 2.35 గంటలకు రాకెట్ చంద్రుడి వైపు దూసుకెళ్లింది. ఈ ప్రయోగం విజయవంతమైతే చంద్రుడిపై అడుగుపెట్టిన నాలుగో దేశంగా భారత్ అవతరించనుంది.
బాహుబలి రాకెట్ గా పిలిచే జీఎస్ ఎల్ వీ మార్క్ 3 హెవీ లిఫ్ట్ లాంచ్ వెహికల్ పై ల్యాండర్ విక్రమ్ ను నింగిలోకి పంపించారు. లాంచ్ వెహికల్ మార్క్ 3 (ఎల్ఎం-3)గా నామకరణం చేసిన జీఎస్ఎల్వీ ఎత్తు 43.5 మీటర్లు. ఈ వాహనం ప్రయాణానికి 40 రోజుల సమయం పడుతుంది. అంటే ఆగస్టు 23న వ్యోమనౌక చంద్రుడిపై దిగనుంది.
స్పేస్‌క్రాఫ్ట్ కోసం భూమి నుండి చంద్రునికి ప్రయాణం దాదాపు ఒక నెల పడుతుందని అంచనా వేయబడింది మరియు ఆగస్ట్ 23న ల్యాండింగ్ అవుతుందని అంచనా. ల్యాండింగ్ తర్వాత ఇది ఒక చాంద్రమాన రోజు పని చేస్తుంది. అంటే భూమిపై ఇది దాదాపు 14 రోజులతో సమానం. చంద్రయాన్-3లో ల్యాండర్, రోవర్ మరియు ప్రొపల్షన్ మాడ్యూల్ ఉన్నాయి. దీని బరువు దాదాపు 3,900 కిలోగ్రాములు.