అలిగి ఇంట్లో నుంచి వెళ్లిపోయిన 17 ఏళ్ల బాలిక.. మాయమాటలు చెప్పి తీసుకెళ్లి, మూడు రోజుల పాటు యువకుల గ్యాంగ్ రేప్
కుటుంబ సభ్యులపై కోపంతో ఇళ్లు వదిలేసి వచ్చిన ఓ బాలిక బస్టాండ్ లో కూర్చుంది. ఇదే అదనుగా భావించిన పలువురు యువకులు ఆమెకు మాయమాటలు చెప్పి స్నేహితురాలి గదికి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఇలాగే మరో రెండు రోజుల పాటు ఆమెపై అత్యాాచారం జరిగింది. ఈ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది.
మహారాష్ట్రలో దారుణం వెలుగులోకి వచ్చింది. ఇంట్లో నుంచి అలిగి వెళ్లిన బాలికకు మాయమాటలు చెప్పి పలువురు యువకులు బైక్ పై తీసుకెళ్లారు ఆ తరువాత వరుసగా మూడు రోజుల పాటు ఆమెపై వివిధ ప్రాంతాల్లో సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. భండారాలో జరిగిన ఈ ఘటనతో జిల్లాలో కలకలం రేగింది. ఈ ఘటనలో పోలీసులు ఇప్పటి వరకు 9 మందిని అరెస్టు చేశారు.
‘ఏబీపీ లైవ్’ కథనం ప్రకారం.. భండారా జిల్లాలోని భరత్ ప్రాంతానికి చెందిన 17 ఏళ్ల బాలిక తన కుటుంబ సభ్యులతో గొడవ పడింది. అనంతరం వారిపై జూన్ 27వ తేదీన ఇంట్లో నుంచి బయటకు వచ్చేసింది. అక్కడి నుంచి ఆమె భండారా జిల్లాలోని అడియాల్‌లోని బస్ స్టేషన్‌కు చేరుకుంది. అక్కడ బస్ స్టాప్ లో ఒంటరిగా బాలిక కూర్చుని ఉండటాన్ని ఇద్దరు యువకులు గమనించారు. ఆమె దగ్గరకు వెళ్లి ఎక్కడి నుంచి వచ్చావని ఆరా తీశారు. అనంతరం ఆమెకు మాయమాటలు చెప్పి బైక్ పై రైడ్‌కు తీసుకెళ్లారు.
చీకటి పడిందని చెబుతూ ఆమెను యువకులు స్నేహితురాలి గదికి తీసుకెళ్లారు. అక్కడ నలుగురు యువకులు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మరుసటి రోజు జూన్ 28వ తేదీన నిందితులు ఆమెను మరో స్నేహితుడి గదికి తీసుకెళ్లారు. అక్కడ కూడా మరో నలుగురు బాలికపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. ఆ తర్వాత ఆమెను భండారా బస్ స్టేషన్‌లో దించాడు.
అమానవీయం.. గిరిజనుడి చెవిలో మూత్ర విసర్జన..యూపీలో ఘటన, నిందితుల అరెస్టు
బాధితురాలు బస్ స్టేషన్‌లో ఒంటరిగా ఉందని తెలుసుకున్న మరో నలుగురు యువకులు ఆమెను మళ్లీ మాయమాటలతో జూన్ 29 రాత్రి భండారాలోని మరో ప్రాంతానికి తీసుకెళ్లారు. ఇలా ఆమెపై వరుసగా 27, 28, 29వ తేదీల్లో బాధితురాలిపై సామూహిక అత్యాచారం జరిగింది. తరువాత బాధితురాలు జూన్ 30న రైలులో ముంబైలో ఉంటున్న తన స్నేహితురాలి వద్దకు వెళ్లిపోయింది.
ఇదిలా ఉండగా.. బాలిక కనిపించడం లేదంటూ కుటుంబసభ్యులు అడియాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె మొబైల్ లోకేషన్ ద్వారా బాలిక ఎక్కడుందో పోలీసులు కనిబెట్టారు. అనంతరం ఆమె వద్దకు వెళ్లి పోలీసులు విచారించారు. దీంతో తనపై మూడు రోజుల పాటు, వేర్వేరు ప్రాంతాల్లో తొమ్మిది మంది సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని ఆమె తెలిపింది.
ఘటనా స్థలాలు వేర్వేరుగా ఉండడంతో భండారా, అడియాల్ లో వేర్వేరు చోట్ల కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత మొత్తం తొమ్మిది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. భండారా పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో పవన్ నిఖర్ (25), హితేష్ నినావే (26), కరణ్ ఖేతాడే (26), నిమోహ్ అలియాస్ రోనీ కొటాంగ్లే (28), నితేష్ భోయర్ (30) ఉన్నారు. అడియాల్ పోలీసులు అరెస్టు చేసిన వారిలో సాహిల్ వాగ్మారే (22), వికాస్ మాన్కర్ (24), షెబాజ్ షేక్ (24), రవి బోర్కర్ (22) ఉన్నారు.