సాధారణంగా బంధువులను పెళ్లికి తీసుకెళ్లడానికి బస్సులు, కార్లు బుక్ చేస్తుంటారు. కొన్ని సందర్భాల్లో ట్రైన్స్ లో కొన్ని బోగీలను కూడా బుక్ చేస్తారు. కానీ ఓ జంట ఏకంగా విమానం మొత్తాన్ని బుక్ చేసింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. 

మన దేశంలో పెళ్లిలు చాలా ఆడంభరంగా, విలాసవంతంగా, వైభవంగా ఉంటాయి. పెళ్లి వచ్చే అతిథులకు పెట్టే భోజనం దగ్గర నుంచి, దుస్తులు, అలంకరణపై చాలా ప్రత్యేక శ్రద్ద తీసుకుంటారు. ఇటీవల 3 రోజుల పెళ్లి, 5 రోజుల పెళ్లి కల్చర్ కూడా తిరిగి వస్తోంది. సంగీత్, హల్దీ, పెళ్లి, రిసెప్షన్ అంటూ ఇలా రోజుకో వేడుక చేస్తున్నారు. వీటికి సంబంధించిన వీడియోలు చాలా వైరల్ కూడా అవుతుంటాయి. తాజాగా అలాంటిదే మరో వీడియో కూడా ఇప్పుడు ఇంటర్నెట్ లో ట్రెండింగ్ లో ఉంది. 

పార్ల‌మెంట్ స‌మావేశాలు: నిరుద్యోగం, ధ‌ర‌ల పెరుగుద‌ల స‌హా ప్రజా వ్య‌తిరేక విధానాల‌ను లేవ‌నెత్తనున్న కాంగ్రెస్

ఓ కొత్త జంట బంధువులను పెళ్లి వేధిక దగ్గరకు తీసుకెళ్లడానికి ఏకంగా ఓ విమానాన్నే బుక్ చేసుకుంది. అందులోనే వారంతా వివాహ వేడుకలకు హాజరయ్యారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను శ్రేయా షా అనే యూజర్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. అందులో తన సోదరి పెళ్లికి వెళ్లేందుకు తమ బంధువుల కోసం విమానం బుక్ చేసినట్టు ఆమె అందులో పేర్కొంది. ఇందులో విమానం ముందు భాగం నుంచి ఓ వీడియో కెమెరా మొదలై, చివరి వరకు వెళ్లింది.

ఢిల్లీ అల్లర్ల కేసు నుంచి ఉమర్ ఖలీద్‌కు విముక్తి.. ఢిల్లీ కోర్టు తీర్పు

ఈ సమయంలో బంధువులంతా చేతులు ఊపుతా, కెమెరా వైపు చూస్తూ ఉల్లాసంగా ఉన్నారు. చివరిలో కొత్తగా పెళ్లి చేసుకోబోయే జంట కూడా కూర్చొని ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో శ్రేయ పోస్ట్‌ల ప్రకారం.. జైసల్మేర్‌లోని సూర్యగఢ్‌లో ఈ వివాహం జరిగింది. దాని కోసమే బంధువులంతా విమానం ఎక్కారు. 

View post on Instagram

ఈ వీడియో విపరీతంగా షేర్ అవుతోంది. ఇప్పటి వరకు 10 మిలియన్లకు పైగా వ్యూవ్స్ వచ్చాయి. నెటిజన్లు ఈ క్లిప్‌ను చూసిన అనేక రకాలుగా స్పందిస్తున్నారు. కొత్త కొత్తగా కామెంట్లు పెడుతున్నారు. ‘‘ మీరు ధనవంతులుని చెప్పకుండానే చెబుతున్నారు’’ అని ఓ యూజర్ కామెంట్ చేశాడు. ‘‘ఈ వీడియో నేను పేదవాడిని అని నాకు గుర్తు చేసింది’’ అని మరో యూజర్ పేర్కొన్నాడు. ఇంతకీ ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారు. ?