ఈశాన్య భారతంలో కలకలం రేగింది. ప్యాసింజర్ ట్రైన్‌లో బంగారం, గంజాయి మాదక ద్రవ్యాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రెండు వేరువేరు ఘటనల్లో ఒకరి దగ్గర రూ. 30 లక్షల విలువ చేసే ఐదు బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. కాగా, మరో ఘటనలో 90 కిలోల బరువున్న ఐదు కిలోల గంజాయి మాదక ద్రవ్యాన్ని పట్టుకున్నారు.
గువహతి: నిఘా వర్గాల సమాచారం మేరకు వ్యవహరించిన నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్(Northeast Frontier) సిబ్బంది ప్యాసింజర్ ట్రైన్(Passenger Train)లో ప్రయాణిస్తున్న ఇద్దరి ప్రయాణికుల నుంచి బంగారం(Gold), గంజాయిని(Marijuana) సీజ్ చేసింది. ఈ బంగారం, గంజాయి విలువ రూ. 38.9 లక్షలుగా ఉన్నది. ముందస్తు సమాచారం మేరకు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ)లు సంయుక్తంగా 12423 డీఎన్ (రాజధాని ఎక్స్‌ప్రెస్)లో తనిఖీలు చేసింది. ఈశాన్యంలోని న్యూ జైపల్‌గురిలోని రైల్వే స్టేషన్‌లో ఈ నెల 2వ తేదీన ఈ తనిఖీలు జరిగాయి.
మణిపూర్‌లోని ఇంఫాల్‌కు చెందిన నివాసి ఖుండోంగ్‌బమ్ రన్‌బీర్ మెటెయ్‌ని సిబ్బంది పట్టుకుంది. ఆయన దగ్గర నుంచి నాలుగు బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకుంది. ఈ నాలుగు బంగారు బిస్కెట్లు 800.70 గ్రాముల బరువు ఉన్నాయి. కోచ్ నెంబర్ ఏ1, బెర్త్ నెంబర్ 1 నుంచి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న ఆ వ్యక్తి దీమాపూర్ నుంచి ఢిల్లీకి ప్రయాణిస్తున్నట్టు నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ అధికారి గునీత్ కౌర్ వెల్లడించారు.
Also Read: గుజరాత్ తీరంలో భారీగా డ్రగ్స్ పట్టివేత.. పాకిస్తాన్ బోట్‌లో రూ. 400 కోట్ల హెరాయిన్..
అదుపులోకి తీసుకున్న వ్యక్తిని డీఆర్ఐ సిలిగురికి పంపించారు. ఆయనపై తదుపరి న్యాయబద్ధమైన చర్యలు తీసుకోబోతున్నారు. కాగా, ఆ వ్యక్తి నుంచి రికవరీ చేసుకున్న బంగారం విలువ రూ. 38 లక్షలుగా ఉన్నదని అధికారులు తెలిపారు. కాగా, అదే రోజు మరో ఘటనలో ఐదు ప్యాకెట్ల గంజాయి పట్టుబడింది. అగర్తలా రైల్వే స్టేషన్‌లో ఆర్‌పీఎఫ్ పరిధిలోని కానిస్టేబుల్ సైకత్ పౌల్, కానిస్టేబుల్ వీకే యాదవ్.. 02984 నెంబర్ ట్రైన్‌లో రోటీన్ చెక్ అప్‌లు చేశారు. ఈ రోటీన్ తనిఖీల్లో ఓ వ్యక్తి ఐదు గంజాయి ప్యాకెట్లను పట్టుకు వెళ్లుతున్నట్టు వెలుగులోకి వచ్చింది. ఆ గంజాయి 9 కిలో గ్రాములు ఉన్నట్టు తెలిసింది. రికవరీ చేసిన గంజాయిని వోసీ/జీఆర్‌పీ/అగర్తలాకు పంపించినట్టు వివరించింది.
ఈ రెండు ఘటనలకు సంబంధించి కేసు నమోదైంది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి నవంబర్ కాలంలో ఆర్‌పీఎఫ్, ఎన్ఎఫ్ రైల్వే 300 కేసుల అక్రమ సరుకులను పట్టుకుందని ఓ ప్రకటన తెలిపింది. ఇదేకాలంలో రూ. 10 కోట్ల విలువైన ఆర్‌పీఎఫ్ నిషేధిత మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో కనీసం 99 మందిని అదుపులోకి తీసుకున్నట్టు ఎన్ఎఫ్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ గునీత్ కౌర్ విల్లడించారు.
Also Read: గోవా నుండి డ్రగ్స్ సరఫరా, ముగ్గురి అరెస్ట్: సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర
గుజరాత్ (Gujarat) తీరంలో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. దాదాపు రూ. 400 కోట్ల విలువైన 77 కిలోల హెరాయిన్‌ను (Heroin) అధికారులు సీజ్ చేసుకున్నారు. భారత జల్లాల్లోకి ప్రవేశించిన పాకిస్తాన్ ఫిషింగ్ బోట్‌లో (pakistan fishing boat) హెరాయిన్‌ను గుర్తించిన అధికారులు సీజ్ చేశారు. ఇండియన్ కోస్ట్ గార్డ్, గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించినట్టుగా సంబంధిత వర్గాలు తెలిపాయి. సముద్రంలో రాత్రిపూట ఈ ఆపరేషన్‌ను నిర్వహించారు. డ్రగ్స్ పట్టుబడ్డ పాకిస్తాన్ పడవ అల్ హుసేని (Al Huseini)ని స్వాధీనం చేసుకున్నారు. పడవలో ఉన్న ఆరుగురిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
