Asianet News TeluguAsianet News Telugu

గోవా నుండి డ్రగ్స్ సరఫరా, ముగ్గురి అరెస్ట్: సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర

గోవా నుండి హైద్రాబాద్ కు  డ్రగ్స్ సరఫరా చేస్తున్ ముగ్గురిని అరెస్ట్ చేసినట్టుగా సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. నిందితుల్లో ఒకరు పరారీలో ఉన్నారని  సీపీ చెప్పారు.

Three arrested for Drug peddling in Hyderabad
Author
Hyderabad, First Published Dec 23, 2021, 4:02 PM IST

హైదరాబాద్: గోవా నుండి హైద్రాబాద్ లో డ్రగ్స్ సరఫరా చేసేందుకు ప్రయత్నిస్తున్న ముగ్గురిని  అరెస్ట్ చేసినట్టుగా సైబరాబాద్ సీపీ Stephen Ravindra తెలిపారు.గురువారం నాడు తన కార్యాలయంలో సీపీ స్టీఫెన్ రవీంద్ర మీడియాతో మాట్లాడారు. నిందితుల్లో ఒకరు పరారీలో ఉన్నారని ఆయన చెప్పారు. నిందితుల నుండి  183 గ్రాముల కొకైన్, 44 ఎండీ ఎక్స్‌బాసీ మాత్రలను స్వాధీనం చేసుకొన్నామని సీపీ చెప్పారు. నిందితుల నుండి మూడు సెల్ ఫోన్లను కూడా సీజ్ చేశామన్నారు. సీజ్ చేసిన drugs విలువ 26 లక్షల 28 వేలు ఉంటుందని సీపీ తెలిపారు.  డ్రగ్స్ తరలిస్తున్న వారిపై కేసు నమోదు చేశామన్నారు.

also read:ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో రూ. 14 కోట్ల హెరాయిన్ పట్టివేత.. ఉగాండాకు చెందిన మహిళ బ్యాగ్‌లో..

జాపూద్ అలియాస్ జూడ్ గోవా నుండి హైద్రాాబద్ కు డ్రగ్స్ తీసుకొచ్చాడని సీపీ తెలిపారు.నిందితుడు పరారీలో ఉన్నాడన్నారు.  హైద్రాబాద్ నగరంలోని టోలి‌చౌకీకి చెందిన మహమ్మద్ అఫ్రఫ్ వద్ద 181 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకొన్నట్టుగా తెలిపారు.హైద్రాబాద్ నిజాంపేటకు చెందిన రామేశ్వరం శ్రవణ్ కుమార్ నుండి గ్రాము కొకైన, ప్రకాశం జిల్లాకు చెందిన చరణ్ తేజ నుండి మరో గ్రాము కొకైన్ ను స్వాధీనం చేసుకొన్నట్టుగా సీపీ వివరించారు. సైబరాబాద్ పరిధిలో ఈ ఏడాదిలో ఇప్పటివరకు 202 డ్రగ్స్ కేసులు నమోదు చేసినట్టుగా  ఆయన తెలిపారు. ఈ కేసుల్లో ఇప్పటివరకు 419 మంది నిదితులను అరెస్ట్ చేశామన్నారు. తెలంగాణ రాష్ట్రం డ్రగ్స్ రహిత రాష్ట్రంగా ఉండేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. గంజాయి, డ్రగ్స్ సరఫరాపై నిఘా ఏర్పాటు చేయాలని కూడా సూచించారు. దీంతో ఎక్సైజ్ , పోలీసు శాఖలు సంయుక్తంగా వేర్వేరుగా కూడా  ఆపరేషన్స్ ను నిర్వహిస్తున్నాయి. డ్రగ్స్ సరఫరా చేస్తున్న వారిపై నిఘాను ఏర్పాటు చేశారు. కొత్త సంవత్సర వేడుకలను పురస్కరించుకొని డ్రగ్స్ విక్రయం జరిగే అవకాశం ఉందని పోలీసులు  నిఘాను ఏర్పాటు చేశారు.  గత వారంలోనే డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందులో ఓ మహిళా టెక్కీ కూడా ఉన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios