Asianet News TeluguAsianet News Telugu

చంద్రయాన్‌-3 పనులు మొదలుపెట్టాం, గగన్‌యాన్ కూడా: ఇస్రో ఛైర్మన్ శివన్

చంద్రయాన్-3 వివరాలను ఇస్రో చీఫ్ డాక్టర్ కే. శివన్ బుధవారం మీడియాకు వెల్లడించారు. చంద్రయాన్-3 మిషన్‌కు శ్రీకారం చుట్టామని, పనులు వేగంగా సాగుతున్నట్లు తెలిపారు.

Work on Chandrayaan 3 mission has begun, confirms ISRO chief K Sivan
Author
Bangalore, First Published Jan 22, 2020, 3:48 PM IST

ఇస్రో ప్రతిష్టాత్మకంగా భావించిన చంద్రయాన్-2 విఫలమైనప్పటికీ ఏ మాత్రం నిరాశకు గురికాకుండా చంద్రయాన్-3కి సిద్ధమైన సంగతి తెలిసిందే. ఇందుకు కేంద్ర ప్రభుత్వం కూడా ఇస్రోను ప్రోత్సహిస్తూ నిధులను సైతం కేటాయించింది.

చంద్రయాన్-3 వివరాలను ఇస్రో చీఫ్ డాక్టర్ కే. శివన్ బుధవారం మీడియాకు వెల్లడించారు. చంద్రయాన్-3 మిషన్‌కు శ్రీకారం చుట్టామని, పనులు వేగంగా సాగుతున్నట్లు తెలిపారు. ఈ మిషన్‌లో ల్యాండర్, క్రాఫ్ట్ కార్చు దాదాపు రూ.250 కోట్లు కాగా... లాంచ్ పూర్తయ్యే నాటికి ర.350 కోట్లు వ్యయం అవుతుందని శివన్ చెప్పారు.

Also Read:గగన్‌యాన్ వ్యోమగాముల కోసం హల్వా, వెజ్ బిర్యానీ: స్పేస్‌లో ఎలా తింటారంటే..!!

చంద్రయాన్-2లో ఉన్నట్లే చంద్రయాన్-3లోనూ ల్యాండర్, రోవర్, ప్రోపల్షన్ మాడ్యూల్ ఉంటాయని ఆయన వివరించారు. చంద్రయాన్-2లో ఆర్బిటర్ మిషన్ జీవితకాలం 7 సంవత్సరాలని, చంద్రయాన్-3లోనూ దీనిని ఉపయోగిస్తామని చెప్పారు.

చంద్రుడి మీదకు మనిషిని దింపే మిషన్‌పై మీడియా ఆయనను ప్రశ్నించగా.. ఇది ఇప్పటికిప్పుడు సాధ్యం కాదని, కానీ భవిష్యత్తులో ఏదో ఒక రోజు ఇది సాకారమవుతుందని శివన్ ఆశాభావం వ్యక్తం చేశారు.

Also Read:మరోసారి చంద్రయాన్ ప్రయోగం.. ఇస్రో నిర్ణయం

గగన్‌యాన్ మిషన్‌కు సంబంధించి నలుగురు వ్యోమగాములను ఎంపిక చేశామని.. ఈ నెలాఖరు నాటికి వారు శిఖ్షణ నిమిత్తం రష్యా వెళతారని ఇస్రో ఛైర్మన్ చెప్పారు. 1984లో రాకేశ్ శర్మ రష్యన్ మాడ్యుల్‌లో అంతరిక్షంలో వెళ్లగా.. ఈ సారి భారత వ్యోమగాములు దేశీయ మాడ్యూల్‌లోనే అంతరిక్షంలోకి వెళతారని శివన్ వెల్లడించారు. గగన్‌యాన్ మిషన్ కోసం రష్యాలో శిక్షణ తీసుకునే వ్యోమగాముల్ని గగన్‌నాట్స్‌ అని ముద్దుగా పిలుస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios