ఈ ఏడాది ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్ 2 ప్రయోగం... కొద్దిలో మిస్సయ్యింది.  చంద్రయాన్ 2 విక్రమ్ ల్యాండర్ చంద్రునిపైకైతే వెళ్లింది కానీ... దాని కనెక్షన్ మిస్ అవ్వడంతో... ఉపయోగం లేకుండా పోయింది. అయితే... ఇన్రో ఈ ఏడాది మరోసారి చంద్రయాన్ 2 ప్రయోగం చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకు తగినట్లుగా ఇప్పటికే ఇస్రో ఏర్పాట్లు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. 

వచ్చే సంవత్సరం  జీఏ శాటిలైట్‌, కమ్యూనికేషన్‌ శాటిలైట్‌, వెదర్‌ శాటిలైట్‌ వంటి వాటితో తొలిసారిగా మనుషులను సైతం పంపే మ్యాండ్‌మిషన్‌ వంటి 12 శాటిలైట్లను కూడా లాంచ్ చేసే అవకాశం ఉంది.

ఇదిలా ఉండగా.. జులై 22వ తేదీన చంద్రయాన్ -2 నింగిలోకి దూసుకువెళ్లింది.  ఆ తర్వాత ఒక్కో దశ విజయవంతంగా పూర్తి చేసుకుంటూ చంద్రుడి ఉపరిత కక్ష్యలోకి చేరింది. అనంతరం ఆర్బిటర్ నుంచి విక్రమ్ ల్యాండర్ విడిపోయింది. విక్రమ్ చంద్రుడిపై దిగడానికి 2.1 కిలోమీటర్ల దూరం ఉండగా భూ కేంద్రంతో దానికి సంబంధాలు తెగిపోయాయి. అప్పటి నుంచి విక్రమ్ ల్యాండర్ తో సంకేతాలను పునరుద్ధరించేందుకు ఇస్రో తీవ్ర ప్రయత్నాలు చేసింది కానీ ఫలితం లభించలేదు.

కాగా... ఇటీవల చంద్రుడిపై  చంద్రయాన్ శకలాలను గుర్తించినట్లు నాసా పేర్కొంది. దానికి సంబంధించిన ఫోటోలను కూడా విడుదల చేసింది. అయితే... అంతకన్నా ముందే తాము విక్రమ్ ల్యాండర్ ని గుర్తించామని ఇస్రో పేర్కొంది. నాసా ప్రకటనపై ఇస్రో ఛైర్మన్  శివన్ స్పందించారు. 

నాసాకన్నా ముందే తాము విక్రమ్ ల్యాండర్ ని గుర్తించామని చెప్పారు. ‘‘ మా సొంత ఆర్బిటర్ విక్రమ్ ల్యాండర్ ని గుర్తించింది. ఈ విషయాన్ని మేం ఇప్పటికే ఇస్రో వైబ్ సైట్లో వెల్లడించాం. కావాలంటే మీరు కూడా చూడొచ్చు’’ అని ఆయన పేర్కొన్నారు.

విక్రమ్ ల్యాండర్ ఆచూకీ దొరికనట్లు నాసా కొద్ది రోజుల క్రితం ప్రకటించింది. చంద్రుడి ఉపరితలాన్ని బలంగా ఢీకొట్టడంతో అది విచ్ఛిన్నమైందని తెలిపింది. చెన్నైకి చెందిన మెకానికల్ ఇంజినీర్ షణ్ముగ సుబ్రహ్మణ్యన్ సాయంతో ల్యాడర్ ని గుర్తించినట్లు నాసా పేర్కొంది. దీనికి సంబంధించిన ఫోటోలను అధికారికంగా విడుదల చేసింది.


అయితే... చంద్రయాన్ 2 ప్రయోగం జరిగిన మూడు రోజుల తర్వాత ఇస్రో తమ వెబ్ సైట్ లో ఓ పోస్టు పెట్టింది. ‘ చంద్రయాన్ 2 ఆర్బిటర్ విక్రమ్ ల్యాండర్ ని గుర్తించింది. అయితే... దానితో ఇంకా కమ్యూనికేషన్ జరగలేదు. ల్యాంటర్ తో కమ్యూనికేషన్ పునరుద్ధరించేందుకు సాధ్యమైన అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం’ అని పేర్కొంది.  తాజాగా.. నాసా ఫోటోలు పెట్టడంతో... ఇస్రో ఛైర్మన్ శివన్ పైవిధంగా స్పందిచాల్సి వచ్చింది