Manipur: మహిళల సారథ్యంలోని మూక.. ఇళ్లు, పాఠశాలను కాల్చి బూడిద చేసింది!
మణిపూర్‌లోని చురాచాంద్‌పూర్ జిల్లా సరిహద్దు ప్రాంతం తోర్బంగ్ ఏరియాలో వందలాది మహిళ సారథ్యంలోని మూక ఖాళీ ఇల్లను, పాఠశాలను కాల్చి బూడిద చేసింది. ఈ ఘటన మణిపూర్ స్థానికుడు మీడియాకు తెలిపాడు.

న్యూఢిల్లీ: మణిపూర్‌లో హింసాత్మక ఘర్షణల ఇంకా వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. నమ్మశక్యం కాని రీతిలో అక్కడ దారుణాలు జరిగాయి. తాజాగా, మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. అక్కడ సాయుధ మూక దాష్టీకాలకు తెగబడిన సంగతి తెలిసిందే. తాజాగా, ఇలాంటి కొన్ని మూకలకు మహిళలు సారథ్యం వహించారనే విస్మయకర వాస్తవం వెలుగులోకి వచ్చింది.
బిష్ణుపూర్ జిల్లా సరిహద్దు జిల్లా చురాచాంద్‌పూర్ జిల్లాలోని తోర్బంగ్ బజార్‌లో కనీసం 10 ఇళ్లను, ఒక స్కూల్‌ను ఓ సాయుధ మూక కాల్చి బూడిద చేసినట్టు సోమవారం పోలీసులు వెల్లడించారు. వందలాది మంది మహిళలు మానవ కవచాలుగా మూకకు ఉంటూ.. ఖాళీ చేసిన ఇళ్లను, పాఠశాలను బుగ్గి చేసింది. ఆ మూక పలుమార్లు కాల్పులు జరిపింది. శనివారం సాయంత్రం చేసిన ఈ దాడిలో స్థానికంగా తయారు చేసిన బాంబులనూ విసిరేసినట్టు పోలీసులు వెల్లడించారు.
తోర్బంగ్ బజార్‌లో చిల్డ్రన్ ట్రెజర్ హై స్కూల్ ఉన్నది.
‘వందలాది మంది మహిళల సారథ్యంలో వస్తున్న మూకను మేం ముందే చూశాం. కానీ, వారిపై దాడి చేయడానికి సందిగ్దపడ్డాం. అయితే, ఆ మూక బీఎస్ఎఫ్‌కు చెందిన ఓ వాహనాన్ని లాక్కోవడం, మా ఇళ్లకు నిప్పు పెట్టడం ప్రారంభించగానే మేం రియలైజ్ అయ్యాం. మేం ప్రతిఘటించాల్సి ఉన్నదని, ప్రతిదాడి చేయాల్సి ఉన్నదని అవగాహనకు వచ్చాం’ అని గుర్తు తెలిపేందుకు నిరాకరించిన ఓ స్థానికుడు పీటీఐకి తెలిపాడు.
Also Read: పాకిస్తాన్‌లోని లవర్ కోసం బార్డర్ దాటిన మహిళ.. రాజస్తాన్ నుంచి పాక్.. వెళ్లాక భర్తకు ఏం చెప్పిందంటే?
ఆ మూక ఆ తర్వాత బీఎస్ఎఫ్ కాస్పర్ వాహనాన్ని తీసుకెళ్లాలని ప్రయత్నించింది. కానీ, భద్రతా బలగాలు, అక్కడ స్వచ్ఛందంగా మోహరించిన వాలంటీర్లు ఆ ప్రయత్నాన్ని వమ్ము చేశారు.