Asianet News TeluguAsianet News Telugu

రాజస్థాన్ ఫస్ట్.. ఏపీ లాస్ట్.. ఈ రాష్ట్రాల్లో పురుషుల కంటే మహిళలకే ఎక్కువ లైంగిక సంబంధాలు.. సర్వే..

పురుషుల కంటే మహిళలే ఎక్కువమందితో లైంగిక సంబంధాన్నికలిగి ఉన్నారన్న షాకింగ్ విషయం ఓ సర్వేలో వెల్లడయ్యింది. ఈ సర్వేలో రాజస్థాన్ టాప్ లో ఉంటే.. ఏపీ లాస్ట్ లో ఉంది.
 

Women have more sex partners than men in 11 states and union territories in India : NFHS-5 survey
Author
Hyderabad, First Published Aug 20, 2022, 7:27 AM IST

ఢిల్లీ :ఒకరి కంటే ఎక్కువమంది సెక్స్ పార్టనర్స్ ఉండడం ఇప్పుడు మామూలుగా అంతటా కనిపిస్తోంది. మెట్రో పాలిటన్ నగరాల్లో, నగరాల్లో ఎక్కువగా ఈ కల్చర్ కనిపిస్తుందనుకుంటారు. అయితే షాకింగ్ విషయం ఏంటంటే.. పట్టణాల్లో కంటే గ్రామాల్లోనే ఇలాంటి సంబంధాలు ఎక్కువగా ఉండడం.. అదీ పురుషులకంటే మహిళలకే ఎక్కువమంది పురుషులతో లైంగిక సంబంధాలు ఉండడం ఇప్పుడు ఓ సర్వేలో తేలింది. 

మహిళలతో పోల్చితే పురుషులే ఎక్కువమందితో లైంగిక సంబంధాలను కలిగి ఉంటారని అనుకుంటాం. ఒకరికి తెలియకుండా మరొకరితో సహజీవనం చేస్తూ పురుషుల దొరికిపోయిన సంఘటనల గురించి వినే ఉంటాం. దేశంలోని మహిళల, పురుషుల లైంగిక జీవనానికి సంబంధించి విడుదలైన ఓ సర్వే కీలక విషయాలను బయటపెట్టింది. పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పురుషుల కంటే మహిళలే ఎక్కువగా లైంగిక భాగస్వాములను కలిగి ఉన్నట్లు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో తేలింది. 2019-21 కాలానికి గాను  28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాల్లో నిర్వహించిన NFHSలో ఈ ఆసక్తికర విషయం బయటపడింది. 

రాజస్థాన్, హర్యానా, చండీగఢ్, జమ్మూ కాశ్మీర్, మధ్యప్రదేశ్, కేరళ,  అస్సాం, లక్షద్వీప్, పుదుచ్చేరి, తమిళనాడు రాష్ట్రాల్లో పురుషుల కంటే మహిళలు తమ జీవితకాలంలో అధికమంది లైంగిక భాగస్వాములను కలిగి ఉన్నట్లు సర్వే పేర్కొంటుంది. రాజస్థాన్లో సగటున ఒక మహిళ 3.1 మందితో లైంగికసంబంధం కలిగి ఉండటం గమనార్హం. పురుషుడు 1.8 మందితో లైంగికసంబంధం కలిగి ఉన్నట్లు సర్వే గణాంకాలు చెబుతున్నాయి. పట్టణాలతో పోలిస్తే గ్రామాల్లోనే పురుషులు, మహిళల లైంగిక భాగస్వామ్యుల సగటు అధికంగా ఉంది. పట్టణ ప్రాంతాల్లో  సగటున ఒక పురుషుడు1.7మందితో లైంగిక సంబంధాన్ని కలిగి ఉండగా, మహిళ 1.5మందితో శారీరక బందాన్ని కొనసాగిస్తోంది.

రక్తమోడిన రాజస్థాన్ రహదారులు.. స్పాట్ లోనే ఏడుగురి దుర్మ‌ర‌ణం.. 20 మందికి పైగా తీవ్ర గాయాలు

దేశవ్యాప్తంగా 707 జిల్లాలోని 1.1 లక్షల మంది మహిళలు, లక్ష మంది పురుషులపై జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే చేయగా మహిళలకంటే పురుషులే అధికమంది లైంగిక భాగస్వాములను కలిగి ఉన్నట్లు స్పష్టమవుతోంది. నిరుడు ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మందితో సంబంధం కలిగి ఉన్న పురుషులు 1.2 శాతం కాగా, జీవిత కాలంలో 2.1 మందితో లైంగిక సంబంధాన్ని కలిగి ఉన్నట్లు సర్వేలో తేలింది. అదేవిధంగా గత ఏడాది దేశవ్యాప్తంగా ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మందితో లైంగిక సంబంధాన్ని కలిగి ఉన్న స్త్రీల సంఖ్య 0.3  శాతం కాగా.. వారి జీవితకాలంలో సెక్స్ పార్టనర్ల సంఖ్య 1.7గా ఉంది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం… ఆంధ్రప్రదేశ్ లో గతేడాది ఇద్దరి కంటే ఎక్కువ మందితో లైంగిక సంబంధాలు కలిగిన మహిళలు 0.1 శాతంగా, పురుషులు 1.2 శాతంగా ఉన్నారు. తెలంగాణలో గతేడాది 0.4 శాతం మంది కంటే ఎక్కువ మందితో శారీరక సంబంధాన్ని కలిగి ఉన్నారు. ఇది పురుషుల్లో 2.1 శాతంగా ఉంది. 

Follow Us:
Download App:
  • android
  • ios