ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురిలో 19 ఏళ్ల యువతి తనను పెళ్లి చేసుకోవడానికి నిరాకరించిందనే కారణంతో ఓ యువకుడు ఆమెను గొంతు కోసి చంపాడు.
ఉత్తరప్రదేశ్ : ఉత్తరప్రదేశ్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. మెయిన్‌పురిలో ఓ యువకుడు ఓ 19 ఏళ్ల యువతి తనను పెళ్లికి నిరాకరించిందని.. ఆమెను గొంతు కోసి హత్య చేశాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.
జూలై 24న ఫతేపూర్ గ్రామంలో నిందితుడు అజయ్ చౌహాన్ బాధిత మహిళ ఇంటికి వెళ్లాడు. పెళ్లి చేసుకోవాలంటే తనతో పాటు పారిపోయి రావాల్సిందని కోరాడు. ఆమె దీనికి నిరాకరించింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి వచ్చిన అతను మొబైల్ డేటా కేబుల్‌తో గొంతుకోసి హత్య చేశాడు. ఆ తరువాత అక్కడి నుంచి పరారయ్యాడు.
కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌పై ప్రివిలేజ్ నోటీస్: రాజ్యసభలో విపక్ష కూటమి ఎంపీలు
ఆ మహిళ అజయ్ చౌహాన్‌తో గత ఏడు నెలలుగా రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. వారిద్దరు వివాహం చేసుకోవాలని అనుకున్నారు. కానీ మహిళ కుటుంబం వారి పెళ్లికి ఒప్పుకోలేదు. ఆమెకు వేరే వ్యక్తితో పెళ్లి చేయాలని నిర్ణయించింది. దీంతో ప్రియుడు ఈ దారుణానికి ఒడిగట్టాడు.
విషయం తెలిసిన మహిళ కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు సమాచారం అందించి నిందితులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీనిమీద పోలీసులు విచారణ ప్రారంభించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
