పొరుగింటాయనతో ఎఫైర్.. అప్పుడు కొడుకు చూడటంతో టెర్రస్ మీది నుంచి విసిరేసి హత్య.. మరి భర్తకు ఎందుకు చెప్పిందంటే?
మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ వివాహిత పొరుగింటాయనతో ఎఫైర్ పెట్టుకుంది. ఓ రోజు ఇద్దరూ టెర్రస్ మీద శారీరకంగా కలుసుకున్నారు. అదే సమయంలో మూడేళ్ల కొడుకు మీదికి వచ్చి వారిని చూశాడు. పిల్లాడి ద్వారా ఈ విషయం భర్తకు తెలుస్తుందని భయపడ్డ తల్లి బాలుడిని టెర్రస్ మీది నుంచి కిందికి తోసేసింది. కానీ, ఆ తర్వాత తాను చేసిన నేరాన్ని భర్తకు చెప్పింది.

భోపాల్: మధ్యప్రదేశ్‌లో ఓ వివాహిత పొరుగింటాయనతో ఎఫైర్ పెట్టుకుంది. వారిద్దరూ టెర్రస్ మీద రాసలీలలు ఆడుతుండగా.. ఆమె కొడుకు అక్కడికి వచ్చాడు. వారిద్దరూ సంగమిస్తుండగా చూశాడు. దీంతో ఆ వివాహిత భయపడింది. ఈ విషయం కొడుకు తండ్రికి చెప్పుతాడేమోనని అనుకుంది. వెంటనే టెర్రస్ పై నుంచి కిందికి తోసేసింది. ఆ బాలుడు తీవ్ర గాయాలపాలై హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మరణించాడు. కొన్ని రోజులు ఈ విషయాన్ని దాచిన ఆ వివాహిత చివరకు తన భర్తకు చెప్పింది. నేరాన్ని అంగీకరించింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో చోటుచేసుకుంది.
గ్వాలియర్‌లో ధ్యాన్ సింగ్ పోలీసు కానిస్టేబుల్‌గా చేస్తున్నాడు. ఆయన భార్య జ్యోతి రాథోడ్. వారికి పొరుగునే ఉండే ఉదయ్ ఇందౌలియాతో జ్యోతి రాథోడ్ ఎఫైర్ పెట్టుకుంది. ఏప్రిల్ 28న ధ్యాన్ సింగ్ తన ప్లాస్టిక్ షాప్ ఓపెనింగ్ చేశాడు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగుతుండగా జ్యోతి రాథోడ్, ఉదయ్ ఇందౌలియాలు టైమ్ తీసుకుని టెర్రస్ మీదికి వెళ్లారు. అక్కడ ఇద్దరూ శారీరకంగా కలిశారు. అదే సమయంలో జ్యోతి రాథోడ్ మూడేళ్ల కొడుకు టెర్రస్ మీదికి వచ్చాడు. వారిద్దరూ కాంప్రమైజింగ్ పొజిషన్‌లో చూశాడు.
Also Read: బీజేపీకి సుభాశ్ చంద్రబోస్ మునిమనవడు రాజీనామా.. ‘నేతాజీ లక్ష్యాల ఛేదనకు పార్టీ సహకరించలేదు’
జ్యోతి రాథోడ్ తన కొడుకును చూడగానే భయపడింది. ఈ విషయాన్ని భర్త ధ్యాన్ సింగ్‌కు చెబుతాడేమోనని భయపడింది. వెంటనే టెర్రస్ మీది నుంచే ఆ బాలుడిని కిందికి విసిరేసింది. ఆ బాలుడి తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఆయనను వెంటనే హాస్పిటల్ తీసుకెళ్లారు. కానీ, మరుసటి రోజే అంటే ఏప్రిల్ 29వ తేదీన బాలుడు మరణించాడు.
తొలుత అందరూ ఆ బాలుడు ప్రమాదవశాత్తు టెర్రస్ పై నుంచి కిందపడిపోయాడేమోనని అనుకున్నారు. అసలు విషయాన్ని జ్యోతి రాథోడ్ కూడా ఎవరికి చెప్పలేదు. కొన్నాళ్లు అలాగే దాచేసింది. కానీ, ఆమెకు రాత్రిపూట పీడకలలు రావడం మొదలయ్యాయి. తన కొడుకు గురించి పీడకలలు వచ్చాయి. దీంతో జ్యోతి రాథోడ్ తాను చేసిన నేరాన్ని తన భర్తకు తెలిపింది. ఉన్నది ఉన్నట్టు అంతా చెప్పేసింది. భర్త ధ్యాన్ సింగ్ ఆమె నేరాంగీకారన్ని రికార్డ్ చేసి పోలీసులను ఆశ్రయించాడు. పోలీసు కేసు నమోదైంది. జ్యోతి రాథోడ్, ఆమె లవర్ ఉదయ్ ఇందౌలియాలను పోలీసులు అరెస్టు చేశారు.