మద్యానికి బానిసైన భర్తను కడతేర్చిన భార్య

Woman kills husband in gujarath
Highlights

తల్లిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన కొడుకు

మద్యానికి బానిసై నిత్యం వేధింపులకు గురిచేస్తున్న భర్తను సహనం కోల్పోయిన ఓ భార్య హత్య చేసింది. ఈ ఘటన గుజరాత్ రాష్ట్రంలోని జునాఘడ్ లో చోటుచేసుకుంది. అయితే తన తండ్రిని తల్లే చంపిదని కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.  

జునాఘడ్ జిల్లాలోని రానింగ్ పూర్ గ్రామానికి చెందిన జగదీష్(45), శాంతా(40)లు దంపతులు. వీరికి ఓ కొడుకు ఉన్నాడు. అయితే ఆనందంగా ఉండాల్సిర వీరి కుటుంబంలో మద్యపానం విషాదాన్ని నింపింది.

మద్యానికి బానిసైన జగదీష్ పీకల దాక తాగి వచ్చి నిత్యం భార్యతో గొడవపడుతుండేవాడు. అలాగే నిన్న మధ్యాహ్నం కూడా ఫుల్లుగా తాగి వచ్చి వంట ఎందుకు వండలేదంటూ భార్యతో గొడవకు దిగాడు. కొద్ది సేపట్లో వండిపెడతానని చెప్పినా వినకుండా దాడికి దిగాడు. దీంతో శాంతా ఆగ్రహంతో ఇంట్లో ఉన్న ఇనుపరాడ్ తో భర్త జగదీష్ తలపై కొట్టింది. దీంతో జగదీష్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందాడు.

అయితే తన తండ్రి జగదీష్ ను తల్లి శాంతా హత్యచేసిందని కుమారుడు హీరేన్ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో శాంతాపై కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్టు చేశారు.


 

loader