జమ్ము కశ్మీర్‌లో ఓ మహిళను బుడ్గాం జిల్లాకు చెందిన వ్యక్తి దారుణంగా హత్య చేసి ఆమె బాడీని ముక్కలుగా నరికి వేర్వేరు ప్రాంతాల్లో పడేశాడు. మహిళ కనిపించడం లేదని కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించడంతో దర్యాప్తు ప్రారంభించారు. కాగా, నిందితుడి ఇంటి ముందు నిరసనకు దిగిన ఆందోళనకారులు అతడిని ఉరి తీయాలని డిమాండ్ చేస్తున్నారు. 

శ్రీనగర్: జమ్ము కశ్మీర్‌లో దారుణ హత్య జరిగింది. ఓ యువతిని దారుణంగా చంపేసిన వ్యక్తి.. మృతదేహాన్ని ముక్కలుగా నరికి వేర్వేరు ప్రాంతాల్లో ఆ బాడీ పార్టులను పడేశాడు. వారం క్రితం కనిపించకుండా పోయిన యువతి గురించి కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించిన తర్వాత ఈ ఘటన వెలుగులకి వచ్చింది. పోలీసులు ఆ వ్యక్తిపై అనుమానంతో ప్రశ్నించగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు నిందితుడి ఇంటి ముందు ధర్నాకు దిగారు. నిందితుడికి ఉరి వేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటన జమ్ము కశ్మీర్‌లోని బుడ్గాం జిల్లాలో చోటుచేసుకుంది.

పోలీసుల కథనం ప్రకారం, షాబిర్ అహ్మద్ అనే 45 ఏళ్ల కార్పెంటర్, మృతి చెందిన 30 ఏళ్ల మహిళ పరిచయస్తులు. ఆ మహిళను షాబిర్ అహ్మద్ వారం క్రితం కిడ్నాప్ చేశాడు. ఆమెను చంపేసి ముక్కలుగా నరికేశాడు. ఆమె బాడీ పార్టులను వేర్వేరు ప్రాంతాల్లో పడేసినట్టు పోలీసులు తెలిపారు.

నిందితుడి ఇంటి ముందు స్థానికులు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. నిందితుడిని తమకు అప్పగించాలని, బాధితురాలికి పట్టిన గతే నిందితుడికీ పట్టాలని అన్నారు. ఇలాంటి ఘటన అరుదుల్లోకెల్లా అరుదు అని, కాబట్టి, శిక్ష కూడా అదే స్థాయిలో ఉండాలని డిమాండ్ చేశారు. 

Also Read: చీట్ చేస్తున్నాడని బాయ్‌ఫ్రెండ్‌పై సలసల కాగే నూనె పోసిన యువతి.. అసలేం జరిగిందంటే?

ఆ మహిళకు ఇటీవలే ఎంగేజ్‌మెంట్ జరిగిందని, బహుశా ఆ ఎంగేజ్‌మెంట్‌కు నిందితుడు షాబిర్ అహ్మద్ అభ్యంతరం తెలిపి ఉంటాడని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. మార్చి 7వ తేదీన ఆమె కనిపించకుండా పోయినట్టు ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. 

పోలీసులు ఆ కార్పెంటర్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో అసలు విషయం బయటకు వచ్చింది. ఆమె బాడీ పార్టులను రికవరీ చేసుకున్నారు.