తమిళనాడులోని ఈరోడ్ జిల్లాలో ఓ యువతి తన బాయ్‌ఫ్రెండ్ పై సలసల కాగే నూనెతో దాడి చేసింది. తనను మోసం చేస్తున్నాడని ఈ ఘటనకు పాల్పడింది. నూనె పడ్డ తర్వాత అరుపులు వేయడంతో స్థానికులు ఆ యువకుడిని హాస్పిటల్ తీసుకెళ్లారు. 

చెన్నై: బాయ్‌ఫ్రెండ్ తనను చీట్ చేస్తున్నాడని ఓ యువతి సలసల కాగే నూనె పోసింది. ఆ యువకుడు చేతులు, ముఖం మంటలు మండుతుండటంతో సహాయం కోసం అరుపులు వేశాడు. అతడిని హాస్పిటల్ తీసుకెళ్లారు. పోలీసులు ఆ యువతిని అరెస్టు చేశారు. ఆ యువతీ, యువకులు బంధువులే కావడం గమనార్హం. ఈ ఘటన తమిళనాడులోని ఈరోడ్ జిల్లాలో చోటుచేసుకుంది. 

భవానిలోని వర్ణపురానికి చెందిన యువకుడు కార్తి పెరుందురైలోని ఓ ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్నాడు. ఆయన బంధువైన మీనా దేవితో రిలేషన్‌షిప్‌లోకి వెళ్లాడు. వాళ్లిద్దరూ కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఆమెనే పెళ్లి చేసుకుంటానని కార్తి మాట కూడా ఇచ్చాడు. కానీ, కార్తి తనను మోసం చేస్తున్నాడని మీనా దేవికి తెలిసింది.

కార్తి మరో యువతిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధం అవుతున్నాడని, ఆ యువతితో ఎంగేజ్‌మెంట్ కూడా జరిగిపోయిందని తెలుసుకుంది. ఆ తర్వాత కార్తిని మీనా దేవి నిలదీసింది. ఈ విషయమై వారిమధ్య తరుచూ గొడవలయ్యాయని పోలీసులు తెలిపారు. 

Also Read: కలెక్టర్ డ్యాన్స్ వైరల్.. రంజితమే పాటకు స్టెప్పులతో డ్యాన్స్ ఇరగదీసిన ఆఫీసర్ (వీడియో)కలెక్టర్ డ్యాన్స్ వైరల్.. రంజితమే పాటకు స్టెప్పులతో డ్యాన్స్ ఇరగదీసిన ఆఫీసర్ (వీడియో)

ఈ నేపథ్యంలో మీనాదేవిని కార్తి కలవడానికి వెళ్లినప్పుడు వాగ్వాదం పతాకస్థాయికి చేరుకుంది. కార్తిపై మీనా దేవి సలసల కాగే నూనెను గుమ్మరించింది. కార్తి ఆ వేడి నూనెతోపాటు కిందపడిపోయాడు. ఆయన చేతులు, ముఖం మంటలు మండాయి. సహాయం కోసం అరుపులు వేశాడు. ఇరుగు పొరుగు వారు వెంటనే అక్కడికి వచ్చి కార్తిని హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. పోలీసులు మీనాదేవిని అరెస్టు చేశారు. కేసులో దర్యాప్తు ప్రారంభించారు.