అర్థరాత్రి స్కూల్ టాయిలెట్స్ ఆడశిశువుకు జన్మనిచ్చి.. అక్కడే వదిలేసి వెళ్లిన మహిళ..
ఓ గుర్తు తెలియని మహిళ అర్థరాత్రి స్కూల్ టాయిలెట్ లో ఆడశిశువుకు జన్మనిచ్చింది. ఆ తరువాత శిశువును అక్కడే వదిలేసి వెళ్లిపోయింది.

రాజస్థాన్ : రాజస్థాన్లోని ఉదయపూర్ జిల్లాలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఓ స్కూలు టాయిలెట్లో ఆడ శిశువుకు జన్మనిచ్చిన మహిళ అక్కడి నుంచి మాయమైంది. నవజాత శిశువు రాత్రంతా టాయిలెట్ లోనే ఉండిపోయింది. ఈ షాకింగ్ ఘటన ఉదయ్ పూర్ జిల్లాలోని కళ్యాణ్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. ఉదయం పాఠశాల తెరవగానే శిశువురోదనలు వినిపించడంతో గమనించగా.. ఈ దారుణమైన విషయం వెలుగు చూసింది.
స్కూలు టాయిలెట్లో శిశువు ఉండడం చూసిన విద్యార్థులు, సిబ్బంది ఆశ్చర్యపోయారు. వెంటనే పాఠశాల సిబ్బంది స్పందించి శిశువును స్థానిక ఆసుపత్రికి తరలించారు. పోలీసులకు సమాచారం అందించారు. శిశువును స్థానిక ఆసుపత్రి నుంచి ఉదయపూర్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం నవజాత శిశువు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది.
హైదరాబాద్-బెంగళూరు, విజయవాడ- చెన్నై మార్గాల్లో వందేభారత్ రైళ్లు.. వచ్చే వారమే ప్రారంభం..
దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. కళ్యాణ్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డెత్కియా గ్రామంలో.. ఓ ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో ఈ ఘటన జరిగింది, స్కూల్లోని టాయ్ లెట్ లో ఓ గుర్తు తెలియని మహిళ ఆడ శిశువుకు జన్మనిచ్చి, అక్కడే వదిలేసి వెళ్ళిపోయింది. అప్పుడే పుట్టిన ఆ శిశువు రాత్రంతా ఏడుస్తూనే ఉంది.
స్కూలు చుట్టుపక్కల అంతా నిర్మానుష్య ప్రదేశం కావడంతో చిన్నారి ఏడుపు ఎవరికీ వినిపించలేదు. మర్నాటి ఉదయం స్కూల్ తెరిచిన తర్వాత చిన్నారి ఏడుపు వినిపించింది. దీంతో సందేహం వచ్చిన విద్యార్థులు టాయిలెట్లోకి వెళ్లి చూడగా రక్తంతో తడిసి ఉన్న నవజాత శిశువు ఏడుస్తూ కనిపించింది. వెంటనే ఈ విషయాన్ని టీచర్లకు చెప్పారు.
హుటాహుటిన అక్కడికి వచ్చి పరిశీలించిన టీచర్లు విషయాన్ని కళ్యాణ్ పూర్ పోలీస్ స్టేషన్ కి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానిక రిషభదేవ్ ఆసుపత్రికి నవజాత శిశువును తరలించి ప్రధమ చికిత్స అందించారు. అక్కడినుంచి మెరుగైన చికిత్స కోసం ఉదయపూర్ కు తరలించారు. ఉదయపూర్ లోని ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రస్తుతం ఆశీస్సులు చికిత్స పొందుతుంది.
ఇంత దారుణానికి ఒడికట్టిన ఆ మహిళపై పోలీసులు కేసు నమోదు చేశారు. గుర్తుతెలియని ఆ మహిళ ఆచూకీ కనుగొనడం కోసం సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. అయితే, ఇప్పటివరకు పోలీసులకు ఎలాంటి సమాచారం దొరకలేదని తెలుస్తోంది. నవజాత శిశువును స్కూలు మరుగుదొడ్డిలో వదిలేసి వెళ్లిన ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.