Asianet News TeluguAsianet News Telugu

కోవిడ్ వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్ తో మ‌హిళ మృతి.. బిల్ గేట్స్, సీరమ్ ఇన్‌స్టిట్యూట్‌కు బాంబే హైకోర్టు నోటీసులు

కోవిషీల్డ్  వ్యాక్సిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్ లు వచ్చాయని, ఒకరి మృతికి ఆ వ్యాక్సినే కారణం అంటూ దాఖలైన పిటిషన్ పై బాంబే హైకోర్టు స్పందించింది. సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ కు బాంబే హైకోర్టు నోటీసులు జారీ చేసింది. 

Woman dies due to covid vaccine side effect.. Bombay High Court notices to Bill Gates, Serum Institute
Author
First Published Sep 3, 2022, 10:47 AM IST

కోవిషీల్డ్ వ్యాక్సిన్ దుష్ప్రభావాల వల్లే తన కూతురు చనిపోయిందని ఆరోపిస్తూ దిలీప్ లునావత్ దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (SII), మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ కు బాంబే హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వీటిపై స్పందించాల‌ని ఆదేశాలు జారీ చేసింది. ఆ పిటిష‌న్ దారుడు తనకు జరిగిన నష్టానికి పరిహారంగా రూ.1000 కోట్లు ఇవ్వాలని అప్పీల్ చేశారు. 

వలస కార్మికులతో వెళ్తున్న బస్సును ఢీకొన్న ట్రక్కు.. నలుగురు మృతి, 24 మందికి గాయాలు..

2020 సంవ‌త్సరంలో భారతదేశంతో పాటు మ‌రో మూడు దేశాల కోసం 100 మిలియన్ డోసుల కోవిడ్ షీల్డ్ వ్యాక్సిన్‌ల తయారీ, డెలివరీ ప్రక్రియను వేగవంతం చేయడానికి సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ నేప‌థ్యంలోనే బిల్ గేట్స్ కూడా నోటీసులు జారీ అయ్యాయి. 

పురుట్లోనే బిడ్డ చనిపోయినా, మృతశిశువు జన్మించినా.. 60 రోజుల ప్రసూతి సెలవులు..

పిటిషన్‌లోని ఇతర ప్రతివాదులుగా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా, డ్రగ్ కంట్రోలర్ జనరల్ డాక్టర్ విజి సోమాని, ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా పేర్లు కూడా ఉన్నాయి. 

నిత్యానందకు తీవ్ర అనారోగ్యం.. వైద్య సాయం అందించాల‌ని శ్రీలంక అధ్య‌క్షుడికి లేఖ‌

ఔరంగాబాద్‌కు చెందిన దిలీప్ లునావత్ అనే వ్యక్తి తన కుమార్తె ధామన్‌గావ్‌లోని SMBT డెంటల్ కాలేజీ హాస్పిట‌ల్ లో డాక్టర్, సీనియర్ లెక్చరర్ అని కోర్టుకు తెలిపారు. ఇన్‌స్టిట్యూట్‌లోని ఆరోగ్య కార్యకర్తలందరూ వ్యాక్సిన్‌ను తీసుకోవాలని ఆదేశాలు రావ‌డంతో తన కుమార్తెకు కూడా బ‌ల‌వంతంగా టీకా వేశార‌ని పిటిష‌న‌ర్ చెప్పారు. వ్యాక్సిన్ లు పూర్తి సుర‌క్షితం అని, వాటి వ‌ల్ల ఎలాంటి ప్ర‌మాదాలూ ఉండ‌వ‌ని హామీ ఇచ్చాకే టీకా వేశార‌ని పేర్కొన్నారు.

అగ్రవర్ణ మహిళను పెళ్లి చేసుకున్న దళిత వ్యక్తిని హత్య చేసిన అత్తమామలు..

త‌న కూతురు 2021 జనవరి 28వ తేదీన కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకుంద‌ని దాని దుష్ప్రభావాల కారణంగా 2021 మార్చి 2021 ఆమె మ‌ర‌ణించింద‌ని పిటిష‌న‌ర్ పేర్కొన్నారు. టీకా తీసుకున్న స‌ర్టిఫికెట్ కూడా పిటిష‌న్ కు అటాచ్ చేశారు. వ్యాక్సిన్ వేసుకున్న నాటి నుంచి ఆమెకు తల‌నొప్పి మొద‌లైంద‌ని పేర్కొన్నారు. కొంత కాలం త‌రువాత హాస్పిటల్ లో చేరాల్సి వ‌చ్చింద‌ని తెలిపారు. త‌న కూతురు ట్రీట్మెంట్ కోసం 14 ల‌క్ష‌ల రూపాయిల ఖ‌ర్చు చేశామ‌ని.. అయినా ఆమె చ‌నిపోయింద‌ని పేర్కొన్నారు. త‌న కూతురుకు న్యాయం చేయాల‌ని, అలాగే ఇత‌రుల ప్రాణాల‌ను కాపాడాల‌ని పిటిష‌నర్ కోరారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios