తనతో విడిపోయి.. వేరే వ్యక్తితో కలిసి ఉంటోందని ఓ భర్త.. మాజీ భార్యమీద పగబట్టాడు. చివరికి ఆమెను చేతులు కట్టేసి, బిల్డింగ్ మీదినుంచి తోసిసి కిరాతకంగా హత్య చేశాడు. 

ఢిల్లీ : సంసారం అన్నాక గొడవలు కామన్. అవి ముదిరితే భార్య భర్తలిద్దరి మధ్య సఖ్యత చెడిపోతుంది.ఇది తీవ్రంగా మారితే విడిపోయి ఎవరి మానాన వారు హాయిగా ఉంటారు. ఇటీవలి కాలంలో ఇలాంటి ఘటనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీనివల్ల ఎలాంటి సమస్య ఉండదు. ఎవరి జీవితాలు వారు ఇష్టం వచ్చిన రీతిలో జీవిస్తారు. కానీ కొంతమంది మాత్రం విడిపోయిన తర్వాత కూడా వారి పై కక్ష పెంచుకుని చంపేందుకు ప్రయత్నిస్తుంటారు. అచ్చం అలాగే ఒక వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆగ్రా లోని నాగ్లా మేవతిలోని అపార్ట్మెంట్లో రితికా సింగ్ అనే వివాహిత హత్యకు గురయింది. ఆమె ఘజియాబాద్ నివాసి. ఫిరోజాబాద్ నివాసి అయిన ఆకాష్ గౌతమి 2014లో వివాహం చేసుకుంది. ఆ తర్వాత కొన్నాళ్లకే 2018లో ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి వారు వేర్వేరుగా ఉంటున్నారు. ఈ మేరకు రితికా సింగ్ తన ఫేస్బుక్ తన స్నేహితుడు విపుల్ అగర్వాల్ తో నాగ్లా మేవతిలోని అపార్ట్మెంట్లో కలిసి ఉంటుంది. ఇదిలా ఉండగా ఆమె మాజీ భర్త, మరో ఇద్దరు మహిళలు కలిసి ఆమె నివాసం వద్దకు వచ్చి దాడి చేసేందుకు ప్రయత్నించారు.

జూనియ‌ర్ కొలీగ్ పై సీనియ‌ర్ అత్యాచారం.. ఫొటోలు చూపించి మ‌రో సారి కూడా.. చివ‌రికి ఏం జ‌రిగిందంటే ?

ఈ హఠాత్పరిణామానికి ఒక్కసారిగా షాక్ అయ్యింది రితిక. వచ్చినవారంతా రీతిగా ప్రియుడిపై కూడా దాడి చేశారు. ఆ తర్వాత వారు అంతటితో ఊరుకోకుండా.. రితిక చేతులు కట్టేసి నాలుగో అంతస్తు నుంచి కిందకి తోసి చంపేశారు. ఈ మేరకు స్నేహితుడు విపుల్ అగర్వాల్ ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయడం మొదలుపెట్టారు. అయితే ఈ కేసుకు సంబంధించి ముగ్గురిని అరెస్ట్ చేశామని, ఇంకా ఇద్దరు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆన్లైన్ లో తెగ వైరల్ అవుతుంది. 

Scroll to load tweet…