Asianet News TeluguAsianet News Telugu

జూనియ‌ర్ కొలీగ్ పై సీనియ‌ర్ అత్యాచారం.. ఫొటోలు చూపించి మ‌రో సారి కూడా.. చివ‌రికి ఏం జ‌రిగిందంటే ?

తమ ఆఫీసులో కొత్తగా జాబ్ లో జాయిన్ అయిన యువతిని ఓ సీనియర్ ఉద్యోగి తన ఇంటికి భోజనానికి ఆహ్వానించి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం ఆమెను బ్లాక్ మెయిల్ చేసి రెండో సారి అలాగే చేశాడు. మూడో సారి అత్యాచారం చేయాలని ప్రయత్నించడంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అతడిని అరెస్టు చేశారు. 

A 31-year-old man has been arrested for raping a junior colleague
Author
Pune, First Published Jun 27, 2022, 8:56 AM IST

ఆమె ఓ ఫైనాన్షియ‌ల్ సొల్యూషన్స్ కంపెనీలో కొన్ని రోజుల కింద‌ట జాబ్ లో జాయిన్ అయ్యింది. అయితే ఒక రోజు అందులో ప‌ని చేసే సీనియ‌ర్ ఉద్యోగి ఆమెను త‌న ఇంటికి పిలిపించి మ‌ద్యం తాగ‌ల‌ని బ‌ల‌వంతం చేశాడు. దీంతో ఆమె మ‌ద్యం తాగి మ‌త్తులోకి జారుకుంది. అనంత‌రం ఆమెపై అత‌డు అత్యాచారం చేశాడు. ఆ స‌మ‌యంలో ఫొటోలు తీశాడు. కొంత కాలం త‌రువాత ఆమెకు ఫోన్ చేసి త‌న ఇంటికి పిలిపించుకున్నాడు. మొద‌టి సారి అత్యాచారం స‌మ‌యంలో తీసిన ఫొటోలు చూసి ఆమెను బ్లాక్ మెయిల్ చేశాడు. త‌న‌కు స‌హక‌రించ‌క‌పోతే ఆ ఫొటోల‌ను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేస్తాన‌ని బెదిరించాడు. దీంతో ఆమె చేసేందేమీ లేక అత‌డికి లొంగిపోయింది. మూడో సారి కూడా అలాగే నిందితుడు కాల్ చేసి బ్లాక్ మెయిల్ చేయ‌డంతో బాధితురాలు పోలీసుల‌ను ఆశ్ర‌యించింది.

కదులుతున్న కారులో ఆరేళ్లకూతురు, తల్లిపై గ్యాంగ్ రేప్...!!

ఈ ఘ‌ట‌న మ‌హారాష్ట్రలోని పూణెలో జ‌రిగింది. బాధితురాలు, పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. బీహార్ కు చెందిన ఓ 31 ఏళ్ల వ్య‌క్తి బ‌వ్ ధాన్ లో నివసిస్తున్నాడు. ఆయ‌న పూణె సిటీలోని ఫైనాన్షియల్ సొల్యూషన్స్ కంపెనీలో చాలా కాలంగా ప‌ని చేస్తున్నాడు. కొంత కాలం కింద‌ట 20 ఏళ్ల యువ‌తి ఆ కంపెనీలో జాబ్ లో జాయిన్ అయ్యారు. దీంతో వీరికి కాస్త ప‌రిచయం ఏర్ప‌డింది. ఈ క్ర‌మంలో జూన్ 6వ తేదీన ఆమెను నిందితుడు త‌న ఇంటికి భోజ‌నానికి ఆహ్వానించాడు. దీంతో ఆమె అత‌డి ఇంటికి వెళ్లింది. ఈ స‌మ‌యంలో ఆమెకు విస్కీ తాగించాడు. అనంత‌రం ఆమెపై అత్యాచారానికి ఒడిగ‌ట్టాడు.

wall posters for bride: పెళ్లి కోసం.. యువ‌కుడి పాట్లు.. పెళ్లికూతురు కావాలంటూ ఊరంతా పోస్టర్లు..

మొద‌టి సారిగా యువ‌తిపై అత్యాచారం చేసిన స‌మ‌యంలో నిందితుడు కొన్ని ఫొటోలు తీశాడు. వాటి ద్వారా ఆమెను బ్లాక్ మెయిల్ చేయాల‌నుకున్నాడు. జూన్ 10వ తేదీన ఆమెకు కాల్ చేసి మ‌ళ్లీ ఇంటికి ర‌ప్పించుకున్నాడు. ఫొటోలు చూపించి ఆమెను బెదిరించాడు. త‌న‌కు స‌హ‌క‌రించ‌క‌పోతే ఈ ఫొటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తాన‌ని బెదిరించి మ‌రో సారి అత్యాచారానికి ఒడిగ‌ట్టాడు. మ‌రో సారి కూడా ఇలాగే చేయాల‌ని జూన్ 25వ తేదీన తెల్ల‌వారుజామున 2.30 గంట‌ల‌కు కాల్ చేశాడు. త‌న ఇంటికి రావాల‌ని చెప్ప‌డంతో బాధిత యువ‌తి హింజేవాడి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు రంగ‌ప్ర‌వేశం చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

Karnataka: పోలీసు స్టేష‌న్ లో పిల్లుల‌కు కొలువులు.. కార‌ణం తెలిస్తే.. అవాక్కు కావాల్సిందే..!

పోలీసులు నిందితుడిపై ఐపీసీ సెక్షన్లు 376 (2) (ఎన్) పదేపదే అత్యాచారం, 354 (ఎ) కింద లైంగిక వేధింపులకు డిమాండ్ చేయ‌డం, నేరం చేయాలనే ఉద్దేశ్యంతో మ‌త్తు ద్వారా గాయపరిచినందుకు సెక్ష‌న్ 328 కింద కేసు నమోదు చేశారు. తదుపరి విచారణ కొనసాగుతోందని హింజేవాడి పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ సీనియర్ ఇన్‌స్పెక్టర్ వివేక్ ముగ్లికర్ తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios