ఫ్లైట్‌లో వాష్‌రూమ్‌లోకి వెళ్లనివ్వలేదని విమానంలోనే ఓ మూలకు మహిళ మూత్రవిసర్జన.. స్టాఫ్‌తో వాగ్వాదం (Video)
ఫ్లైట్‌లో ఆ మహిళ యూరిన్ చేయడానికి వాష్‌రూమ్‌లోకి వెళ్లుతుంటే స్టాఫ్ అడ్డుకుంది. రెండు గంటలపాటు ఎదురుచూసిన ఆ మహిళ.. ఫ్లైట్‌లోనే ఓ మూలకు మూత్రవిసర్జన చేసింది.

న్యూఢిల్లీ: ఓ మహిళా ప్రయాణికురాలు వాష్ రూమ్‌లోకి వెళ్లడానికి ప్రయత్నించగా.. ఫ్లైట్ సిబ్బంది వారించారు. రెండు గంటల పాటు ఆమె వాష్ రూమ్‌లోకి వెళ్లడానికి వెయిట్ చేసింది. చివరకు ఇక తనవల్ల కాదని ఫ్లైట్ ఫ్లోర్ పైనే ఓ మూలకు మూత్రం విసర్జించింది. ఆమె మూత్ర విసర్జన చేస్తుంటే ఫ్లైట్ సిబ్బంది ఆమె వీడియో తీసి వాగ్వాదం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.
అమెరికాకు చెందిన స్పిరిట్ ఎయిర్‌లైన్స్ లో ఈ ఘటన జరిగినట్టు డైలీ మెయిల్ రిపోర్ట్ చేసింది. బ్లాక్, ఎల్లో యూనిఫామ్ వేసుకునే స్పిరిట్ ఎయిర్ లైన్స్ స్టాఫ్ ఆమె మూత్ర విసర్జన చేస్తుండగా వీడియో రికార్డ్ చేశాడు. ఒక్కసారి కెమెరా కు హాయ్ చెప్పు అని అన్నాడు. దీంతో ఆమె ఆగ్రహించింది. ‘నేను మూత్రం విసర్జించాల్సి ఉన్నది. ఇప్పటికే రెండు గంటలు దాటిపోయింది. నువ్వు నన్ను వారించావు. ఆ (వాష్ రూమ్) తలుపులు మూసేశావు.’ అని పేర్కొంది.
Also Read: యువతిని ర్యాపిడో బైక్ ఎక్కించుకుని దారి మధ్యలో డ్రైవర్ హస్తప్రయోగం.. యువతి ఏం చేసిందంటే?
‘మీరు ఫ్లైట్ ఆపేశారు. నేను మూత్రం విసర్జించకుండా ఇంకా ఎక్కువ కాలం నిలవలేక పోయాను. మీరేం చేసుకుంటారో చేసుకోండి. వారెంట్ తెచ్చి అరెస్టు కూడా చేసుకోండి. కానీ, ఇంతకంటే నరకప్రాయంగా అది ఉండదు’ అని ఆ మహిళ ఉక్రోశించింది.
20 సెకండ్ల ఆ వీడియో లో మూత్ర విసర్జన చేసిన తర్వాత ప్యాంట్ ఎక్కించుకుని మహిళ అక్కడి నుంచి వెళ్లిపోవడం కనిపించింది. ఈ ఘటన పై స్పిరిట్ ఎయిర్‌లైన్స్ ఇంకా స్పందించలేదు.