Asianet News TeluguAsianet News Telugu

మూడు నెలలపాటు కాలేజీ స్టూడెంట్‌గా మహిళా కానిస్టేబుల్.. ర్యాగింగ్ కేసు క్రాక్ చేయడానికి అండర్‌కవర్ ఆపరేషన్

మధ్యప్రదేశ్‌లో ఓ మహిళా కానిస్టేబుల్ ర్యాగింగ్ కేసు బ్రేక్ చేయడానికి మూడు నెలలపాటు స్టూడెంట్ అవతారమెత్తింది. ప్రతి రోజూ కాలేజీకి వెళ్లి వారితో చిట్ చాట్ చేసి ర్యాగింగ్‌కు పాల్పడుతున్నవారిని గుర్తించింది. ఆధారాలూ సేకరించింది.
 

woman constable went college in student dress for three months to crack ragging case
Author
First Published Dec 12, 2022, 5:15 PM IST

భోపాల్: ఆమె కూడా అందరి స్టూడెంట్‌లలాగే ప్రతి రోజూ కాలేజీకి వెళ్లింది. భుజాలకు బ్యాగ్ వేసుకుంది. పుస్తకాలు, పెన్నులు రోజూ బ్యాగ్‌లో తీసుకెళ్లింది. ఫ్రెండ్స్‌తో చాటింగ్, క్యాంటిన్‌లో టైమ్ పాస్ ముచ్చట్లు, తాము ఎదుర్కొన్న అనుభవాలను షేర్ చేస్తూ కనిపించింది. అందరిలాగే.. ఆమె కూడా క్లాసులు బంక్ కొట్టింది. వారందరికీ ఆమెకు ఒక తేడా ఉన్నది. మిగతా వారంతా నిజంగానే క్లాసులు వినడానికి వెళ్లితే.. ఆమె మాత్రం ర్యాగింగ్ భూతానికి కళ్లెం వేయడానికి వెళ్లింది. ఆమెనే 24 ఏళ్ల శాలిని చౌహాన్. ర్యాగింగ్ కేసు క్రాక్ చేయడానికి మూడు నెలలపాటు స్టూడెంట్‌గా అక్కడికి వెళ్లింది.

మధ్యప్రదేశ్‌లో ఇండోర్‌లోని మహాత్మా గాంధీ మెమోరియల్ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ జరుగుతున్నట్టు పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఉన్నది. దిండులతో సెక్స్ చేస్తున్నట్టు నటించడం, ఇంకా ఇతర విధాలుగా దారుణమైన రీతుల్లో ర్యాగింగ్ అక్కడ జరిగినట్టు సమాచారం. కానీ, బాధితులు తమ పేర్లు పేర్కొనకుండా.. ర్యాగింగ్ చేసే వాళ్ల పేర్లు కూడా నమోదు చేయకుండా చాలా ఫిర్యాదులు పోలీసులకు వచ్చాయి. బాధితుల పేర్లూ లేకపోవడంతో నిందితులను కాదు కదా.. బాధితులెవరనే విషయం కూడా గుట్టుగానే ఉండిపోయింది. బాధితుల కాంటాక్టు నెంబర్లు ట్రాక్ చేసుకోవడానికి ప్రయత్నించారు. కానీ, హెల్ప్‌లైన్ పాలసీ అందుకు అనుమతించలేదు. దీంతో మరోదారి లేక.. గతంలో పోలీసులు విజయవంతంగా చేపట్టిన ఆపరేషన్ విధానాన్నే ఈ కేసులోనూ పాటించాలని డిసైడ్ అయ్యారు.

Also Read: మళ్లీ ర్యాగింగ్ భూతం.. మైనర్ బాలికను ఫ్రెషర్‌తో బలవంతంగా ముద్దు పెట్టించిన మూక.. వైరల్ వీడియో

నేరుగా మారు వేషంలో పోలీసులే విద్యార్థులతో టచ్‌లో ఉండాలని అనుకున్నారు. వారి ద్వారానే విషయం తెలుసుకుని ఎవిడెన్స్ కలెక్ట్ చేయాలని ప్లాన్ వేసుకున్నారు. అందుకోసం 24 ఏళ్ల శాలిని చౌహాన్‌ను ఎంచుకున్నారు. ఆమె స్టూడెంట్‌గా సరిగ్గా సరిపోయింది.

మూడు నెలల కాలంలో ఆమె దారుణమైన ర్యాగింగ్‌‌తో ప్రమేయం ఉన్న 11 మంది సీనియర్లను గుర్తించింది. వారిని కాలేజీ, హాస్టల్ నుంచి మూడు నెలలపాటు సస్పెండ్ చేశారు.

ఎన్డీటీవీ శాలిని చౌహాన్, ఆమె సీనియర్ ఇన్‌స్పెక్టర్ తెహజీబ్ కాజీలతో మాట్లాడింది. ఖాజీ మాట్లాడుతూ, తమకు బాధితులు పేర్లు చెప్పకుండా చాలా సార్లు ఫిర్యాదులు చేశారని, పిల్లోస్‌తో సెక్స్ చేస్తున్నట్టు ప్రిటెండ్ చేయడం, ఇంకా ఇతర వల్గర్ యాక్టివిటీస్‌ను ఫస్ట్ ఇయర్ స్టూడెంట్లతో చేయిస్తున్నట్టు ఫిర్యాదులు వచ్చాయి. కానీ, తమకు బాధితులు, నిందితుల వివరాలేవీ లేవని ఆయన తెలిపారు. దీంతో శాలిని, మరికొందరు కానిస్టేబుళ్లను ప్లేన్ డ్రెస్‌లలో అక్కడికి వెళ్లి డైలీ స్టూడెంట్లతో చిట్ చాట్ చేయాలని, తద్వార ఎవిడెన్స్ కనుక్కోవాలని చెప్పామని, ఈ విధానంలోనే తాము కేసు క్రాక్ చేశామని చెప్పారు.

Also Read: అస్సాం యూనివర్సిటీ ర్యాగింగ్ కేసు.. ఆరోవ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు...

ఇది తనకు పూర్తిగా ఒక కొత్త అనుభవం అని శాలిని చెప్పింది. ప్రతి రోజూ కాలేజీకి వెళ్లి తాను స్టూడెంట్ అనే నటించేదాన్ని అని ఆమె తెలిపింది. క్యాంటీన్‌లో విద్యార్థులతో మాట్లాడేదాన్ని అని, తొలుత తన గురించి మాట్లాడి తర్వాత ఎదుటి వారి నుంచి సమాచారం సేకరించేదాన్ని అని వివరించింది.

ఎప్పుడూ మిమ్మల్ని అనుమానించలేదా అని అడగ్గా.. కొన్నిసార్లు తన గురించి కూడా విద్యార్థులు ఆరా తీసేవారని, కానీ, తాను వెంటనే టాపిక్ చేంజ్ చేసేదాన్ని అని వివరించింది. క్యాంటీన్ చాలా రద్దీగా ఉండేదని, కాబట్టి, అంత సీరియస్‌గా ఆలోచించేవారు కాదని తెలిపింది.

Follow Us:
Download App:
  • android
  • ios