Asianet News TeluguAsianet News Telugu

అస్సాం యూనివర్సిటీ ర్యాగింగ్ కేసు.. ఆరోవ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు...

అస్సాం దిబ్రూగఢ్ యూనివర్సిటీ ర్యాగింగ్ కేసులో పోలీసులు ఆరో వ్యక్తిని బుధవారం అరెస్ట్ చేశారు. ఇప్పటికే ఐదుగురిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. 

Police Arrest 6th Accused In Dibrugarh University Ragging Case In Assam
Author
First Published Nov 30, 2022, 1:17 PM IST

దిబ్రూగఢ్ : సీనియర్ల ర్యాగింగ్ తట్టుకోలేక, తప్పించుకోవడానికి రెండో అంతస్తు నుంచి దూకి ప్రాణాపాయ స్థితిలో పడిన విద్యార్థి ఘటన అస్సాంలోని దిబ్రూగఢ్ విశ్వవిద్యాలయంలో చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే ఐదుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, బుధవారం అనుమానితుడిగా ఉన్న ఆరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. 

ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే డిబ్రూగఢ్ యూనివర్సిటీకి చెందిన కామర్స్ విద్యార్థి ఆనంద్ శర్మ నవంబర్ 27న తన పీఎన్జీబీ హాస్టల్ భవనంలోని రెండో అంతస్తు నుంచి కిందికి దూకాడు. సీనియర్లు ర్యాగింగ్ చేయడంతో విసిగిపోయిన ఆనంద్ శర్మ ఇలా చేశాడని అంటున్నారు. అతడు దూకిన వెంటనే.. గమనించిన అక్కడివారు అతడిని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అయితే, అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

ఈ ఘటనలో నిందితులుగా ఐదుగురు విద్యార్థులపై ఆనంద్ శర్మ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు దిబ్రూఘర్ పోలీసులు కేసు నమోదు చేశారు. దిబ్రూఘర్ యూనివర్సిటీలో జరిగిన ర్యాగింగ్ ఘటనపై మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించామని, అదనపు డిప్యూటీ కమిషనర్ (ఏడీసీ) సంఘమిత్ర బారుహ్ విచారణకు నాయకత్వం వహిస్తారని డిబ్రూఘర్ డిప్యూటీ కమిషనర్ బిస్వజిత్ పెగు నవంబర్ 28న తెలియజేశారు.

అస్సాంలోని యూనివర్సిటీలో ర్యాంగింగ్.. జూనియర్ కు 80 చెంపదెబ్బలు.. రెండో అంతస్తు నుంచి దూకి...

దిబ్రూగఢ్ యూనివర్సిటీలో జూనియర్లను ర్యాగింగ్ చేసినందుకు ముగ్గురు వ్యక్తులను నవంబర్ 29న అరెస్టు చేసినట్లు దిబ్రూఘర్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ శ్వేతాబ్క్ మిశ్రా తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసు అధికారి తెలిపారు. ర్యాగింగ్ ఘటనలో పాల్గొన్న 18 మంది విద్యార్థులను డిబ్రూఘర్ యూనివర్సిటీ నవంబర్ 28న సస్పెండ్ చేసింది.

అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ కూడా దీనిమీద ట్వీట్ చేశారు. "రాగింగ్ కారణంగా డిబ్రూఘర్ విశ్వవిద్యాలయ విద్యార్థి గాయపడినట్లు నా దృష్టికి వచ్చింది. దీనిమీద జిల్లా అధికారుల సమన్వయంతో పరిశీలించి, తదుపరి చర్యలు తీసుకోమని ఆదేశించాం. నిందితుడిని పట్టుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. బాధితుడికి వైద్యచికిత్స అందిస్తున్నారు. ర్యాగింగ్‌కు నో చెప్పమని.. విద్యార్థులకు విజ్ఞప్తి చేస్తున్నాను" అంటూ ట్వీట్ చేశారు.

అసోం యూనివర్సిటీలో ర్యాగింగ్ కలకలం.. 2వ అంతస్తు నుంచి దూకేసిన విద్యార్థి.. ఐదుగురు అరెస్టు

ఈ ఘటనను ఖండిస్తూ, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అసోం విద్యాశాఖ మంత్రి రనోజ్ పెగు సోమవారం దిబ్రూఘర్ యూనివర్సిటీ అధికారులను, పోలీసులను కోరారు. "ఇలాంటి చర్యలను సహించం. ర్యాగింగ్‌కు పాల్పడినట్లు తెలిస్తే అప్రమత్తంగా ఉండాలని, వెంటనే చర్యలు తీసుకోవాలని విశ్వవిద్యాలయ అధికారులను కోరుతున్నాను. మాజీ విద్యార్థులను హాస్టళ్లలో ఉండనివ్వకూడదు" అని అస్సాం విద్యా మంత్రి చెప్పారు.

ర్యాగింగ్ ఘటనపై దర్యాప్తు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పోలీసులను ఆదేశించిందని, వర్సిటీ అధికారులు ఘటనను కప్పిపుచ్చేందుకు ప్రయత్నించారా అనే దానిపై విచారణ జరపాలని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ నవంబర్ 29న చెప్పారు. ర్యాగింగ్ ఘటనలో దిబ్రూగఢ్ యూనివర్శిటీ నిర్లక్ష్యం ఉందని అస్సాం ముఖ్యమంత్రి అన్నారు.

"నిన్న, అస్సాం క్యాబినెట్ దిబ్రూగఢ్ యూనివర్సిటీ అథారిటీ పోషించిన పాత్రపై అసంతృప్తిని వ్యక్తం చేసింది. దిబ్రూగఢ్ యూనివర్సిటీ అధికారులు సంఘటనను కప్పిపుచ్చడానికి ప్రయత్నించారా లేదా అనే దానిపై దర్యాప్తు చేయమని పోలీసులను ఆదేశించాం. ర్యాగింగ్ పట్ల జీరో టాలరెన్స్ విధానం మాది. బాధితుడికి అన్ని విధాలా సాయం అందించాలని డిప్యూటీ కమీషనర్‌ను ఆదేశించాను. బాధితుడిని మెరుగైన వైద్యం కోసం రాష్ట్రం బైటికి తరలించాలని అతని తల్లిదండ్రులు కోరుకుంటే, అన్ని సౌకర్యాలు కల్పించాలని విద్యాశాఖ మంత్రిని కోరుతున్నాను.. ఈ ఘటనలో పారిపోయిన వారిని పోలీసులు అరెస్ట్ చేస్తారు’ అని ముఖ్యమంత్రి అన్నారు.నివేదికల ప్రకారం, సెప్టెంబర్ నుండి దిబ్రూగఢ్ విశ్వవిద్యాలయంలో ర్యాగింగ్ కొనసాగుతోంది.  విద్యార్థి ఆనంద్ శర్మ దాని గురించి దిబ్రూగఢ్ విశ్వవిద్యాలయ అధికారులకు లెటర్ కూడా రాశాడు. లేఖలో పలువురు సీనియర్ విద్యార్థుల పేర్లను కూడా ప్రస్తావించాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios