Asianet News TeluguAsianet News Telugu

డిసెంబర్ 7 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు..

డిసెంబర్ 7వ తేదీ నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరగనున్నాయి. ఈ సారి సమావేశాల్లో పలు బిల్లులను ప్రవేశపెట్టి, వాటిని ఆమోదింపజేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుండగా.. పలు సమస్యలను లేవెనెత్తుతూ ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టాలని ప్రతిపక్షాలు నిర్ణయించుకున్నాయి. 

Winter session of Parliament from December 7..
Author
First Published Nov 20, 2022, 9:24 AM IST

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఈ ఏడాది డిసెంబర్ 7వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. 29వ తేదీ వరకు కొనసాగుతాయి. ఈ మేరకు లోక్‌సభ సెక్రటేరియట్‌ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇదే విషయాన్ని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి శనివారం ట్విట్టర్‌లో కూడా పేర్కొన్నారు. ‘‘పార్లమెంట్ శీతాకాల సమావేశాలు 2022 డిసెంబర్ 7 నుండి ప్రారంభమై డిసెంబర్ 29 వరకు 23 రోజుల పాటు కొనసాగుతాయి. ’’ అని ట్వీట్ చేశారు. 

కదులుతున్న ఆటోలో పేలుడు..ఇద్దరికి తీవ్ర గాయాలు.. కర్ణాటకలో ఘటన

ఉభయ సభల అంతస్తుల్లో నిర్మాణాత్మక చర్చలు జరగాలని ప్రభుత్వం భావిస్తోందని మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. అమృత్ కాల్ సెషన్లలో శాసనసభ వ్యాపారం, ఇతర అంశాలపై చర్చ కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు. చనిపోయిన సభ్యులకు నివాళులర్పించిన తర్వాత మొదటి రోజు సభ వాయిదా పడుతుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షాలు అనేక సమస్యలు లేవనెత్తాలని నిర్ణయించుకున్నాయి. దీంతో రెండో రోజు నుంచి వాడీవేడిగా సమావేశాలు జరిగే అవకాశం ఉంది.

ఈ సెషన్‌లో పలు బిల్లులు ప్రవేశ పెట్టాలని, వాటిని ఆమోదింపజేసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. కొత్త డేటా ప్రొటెక్షన్ బిల్లు - 2022 పార్లమెంట్‌లో ఈ సారి ప్రభుత్వం ఆమోదింపజేసుకోవాలని చూస్తున్న బిల్లులలో ప్రముఖమైనది. ప్రస్తుతం కోవిడ్ -19 కేసులు భారీగా క్షీణించాయి. దీంతో లోక్‌సభ, రాజ్యసభ లోని సభ్యులూ, సిబ్బంది పూర్తిగా టీకాలు వేసుకున్నారు. కాబట్టి ఈ సెషన్ లో ఎలాంటి కోవిడ్ పరిమితులు లేకుండా సభ ముందు సాగే అవకాశం ఉంది. గత రెండేళ్లుగా పార్లమెంట్ సమావేశాలపై కోవిడ్ ప్రభావం పడింది.

మరణించిన ప్రియురాలిని పెళ్లాడిన యువకుడు.. మళ్లీ వివాహం చేసుకోబోనని ప్రమాణం.. సోషల్ మీడియాలో వైరల్..

కాగా.. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో బిజీగా ఉన్నారు. కాబట్టి పార్లమెంటు శీతాకాల సమావేశాలకు ఆయన హాజరయ్యే అవకాశం ఉండకపోవచ్చని ఆ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి జైరాం రమేష్ అన్నారు. ఈ సారి మొదటి రోజు సమావేశంలో సమాజ్‌వాదీ పార్టీ పితామహుడు ములాయం సింగ్ యాదవ్ తో పాటు ఇతర దివంగత సభ్యులకు నివాళి అర్పించనున్నారు. 

కాగా.. అంతకుముందు వర్షాకాల సమావేశాలు జూలై 18 నుంచి ఆగస్టు 16 వరకు 22 రోజుల పాటు జరిగాయి. ఈ సమావేశంలో ప్రభుత్వం ఆరు బిల్లులను లోక్‌సభలో ప్రవేశపెట్టగా, ఉభయ సభలు ఐదు బిల్లులను మాత్రమే ఆమోదించాయి. లోక్‌సభలో ఒక బిల్లును ఉపసంహరించుకున్నారు. అయితే శీతాకాల సమావేశాలు సాధారణంగా నవంబర్ మూడో వారంలో ప్రారంభమవుతాయి. అయితే 2017, 2018లో డిసెంబర్‌లో కూడా సెషన్‌లు జరిగిన సందర్భాలు ఉన్నాయి. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు పాత భవనంలో జరిగే అవకాశం ఉంది.

కొత్త ఎన్నికల కమిషనర్‌గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అరుణ్ గోయల్

హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరగబోతున్నాయి. గుజరాత్‌లో డిసెంబర్ 1,5న అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా, హిమాచల్ ప్రదేశ్‌లో నవంబర్ 12న నిర్వహించనున్నారు. ఈ రెండు రాష్ట్రాల అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు డిసెంబర్ 8వ తేదీన చేపట్టున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios