Asianet News TeluguAsianet News Telugu

కదులుతున్న ఆటోలో పేలుడు..ఇద్దరికి తీవ్ర గాయాలు.. కర్ణాటకలో ఘటన

కర్ణాటక రాష్ట్రంలోని మంగళూరులో పేలుడు సంబంధించింది. కదులుతున్న ఆటోలో ఒక్క సారిగా మంటలు చెలరేగడం స్థానికంగా కలకరం రేపింది. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలు అయ్యాయి. 

Tragedy in Karnataka..Explosion in a moving auto..Two seriously injured..
Author
First Published Nov 20, 2022, 8:24 AM IST

కర్ణాటకలోని మంగళూరులో శనివారం ఓ ఆటో పేలిపోయింది. తరువాత ఒక్క సారిగా మంటలు చెలరేగాయి. సిటీలో రద్దీగా ఉండే ప్రాంతంలో ఈ ఘటన సంభవించింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ తో పాటు మరో ప్రయాణికుడు గాయపడ్డాడు. ఈ పేలుడుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మరణించిన ప్రియురాలిని పెళ్లాడిన యువకుడు.. మళ్లీ వివాహం చేసుకోబోనని ప్రమాణం.. సోషల్ మీడియాలో వైరల్..

ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసు కమిషనర్ ఎన్ శశికుమార్ అక్కడికి చేరుకున్నారు. పేలుడుకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని అన్నారు. అయితే ఘటనకు కారణాన్ని ధృవీకరించడానికి ప్రత్యేక బృందాన్ని, ఎఫ్‌ఎస్‌ఎల్ (ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్) బృందాన్ని పిలిపించామని తెలిపారు. ఇది ఉగ్రదాడి కాదా అనే కోణంలో భద్రతా సంస్థలు విచారణ జరుపుతున్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయని ‘టైమ్స్ నౌ’ కథనం పేర్కొంది. 

అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. ఆటోలో ఎక్కిన వ్యక్తి చేతిలో ఒక బ్యాగ్ ఉంది. ప్రయాణ సమయంలో అందులో ఒక్క సారిగా మంటలు వ్యాపించాయి. అది పేలుడుకు దారి తీసింది. అయితే ఈ ఘటనలో వారిద్దరికీ తీవ్రగాయాలు అయ్యాయి. ప్రస్తుతం వారు చికిత్స పొందుతున్నారు. పరిస్థితి నిలకడగా ఉంది. 

కొత్త ఎన్నికల కమిషనర్‌గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అరుణ్ గోయల్

ఈ ఘటనపై వస్తున్న ఎలాంటి వదంతులను నమ్మవద్దని సీపీ కుమార్ స్థానిక ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అగ్నిప్రమాదానికి గల కారణాలపై విచారణకు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ బృందాన్ని పిలిపించామని, ప్రజలు ఎలాంటి పుకార్లను పట్టించుకోవద్దని ఆయన అన్నారు.భయపడాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. ఇంటర్నెట్, మీడియా ద్వారా గందరగోళాన్ని వ్యాప్తి చేయవద్దని కోరారు. దీనిపై విచారణ సాగుతోందని తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios