కోల్‌కత్తా: ఆస్తులను ధ్వంసం చేసిన కేసుల్లో పాల్గొన్న వారిని కుక్కలను కాల్చినట్టు వేస్తామని బీజేపీ  పశ్చిమ బెంగాల్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ,మిడ్నపూర్ ఎంపీ దిలీప్ ఘోష్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు బెంగాల్ రాష్ట్రంలో తీవ్ర దుమారాన్ని రేపాయి.

Also read:టీఆర్ఎస్‌తో దోస్తీ: విస్తరణకు ఎంఐఎం వ్యూహమిదీ..

ఆదివారం నాడు నాడియా జిల్లాలో ఆదివారం జరిగిన ఒక బహిరంగ సభలో దిలీప్‌ ఘోష్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.ఈ వ్యాఖ్యలు రాష్ట్రంలో తీవ్ర దుమారాన్ని రేపాయి. పౌరసత్వ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనలు నిర్వహిస్తున్న వారిపై బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇదే రకంగా చేసినట్టుగా ఆయన చెప్పారు. ఉత్తర్‌ప్రదేశ్, అసోం, కర్ణాటక రాష్ట్రాల్లో ఇదే పద్దతిని అవలంభించినట్టుగా ఆయన ఈ సభలో ప్రస్తావించారు.

Also read:పౌరసత్వ సవరణ చట్టంపై ఒవైసీ నిరసన: పాతబస్తీలో తిరంగా ర్యాలీ

గత ఏడాది డిసెంబర్ మాసంలో సీఏఏకు వ్యతిరేకంగా జరిగిన ప్రదర్శనల సమయంలో రైల్వేలతో పాటు ప్రజా ఆస్తులను ధ్వంసం చేసిన కేసులో ఆందోళనకారులపై లాఠీచార్జీ, కాల్పులకు మమత బెనర్జీ సర్కార్ ఆదేశించలేదని ఆయన గుర్తు చేశారు.

ఈ వ్యాఖ్యలపై తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేత అనుబ్రత మోండల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఘోష్ ను కాల్చివేయాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియో ఘోష్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఈ వ్యాఖ్యలు  బాధ్యతారాహితంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు.

యూపీలో, అసోం రాష్ట్రాల్లో ఈ తరహ ఘటనలు చోటు చేసుకోలేదని సుప్రియో అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకొన్నారు. ఘోష్ బాధ్యతరాహిత్యంగా మాట్లాడారని ఆయన వ్యాఖ్యానించారు.

సోమవారం నాడు కూడ ఇదే తరహాలో ఘోష్ వ్యాఖ్యానించారు. దేశంలోని తమ ప్రభుత్వాలు ఏం చేశాయోనని భావించానో, తమకు అవకాశం వస్తే అదే చేస్తామని చెప్పినట్టుగా ఆయన వివరించారు. 

ప్రజల నుండి వసూలు చేస్తున్న పన్నుల ద్వారా నిర్మించిన ప్రజా ఆస్తులను ధ్వంసం చేసిన ఆందోళనకారులను తమ ప్రభుత్వాలు కుక్కలను కాల్చినట్టుగా కాల్చినట్టుగా ఘోష్ ఆదివారం నాడు నాడియా జిల్లాలో జరిగిన సభలో చెప్పారు.