హైదరాబాద్:గత పార్లమెంటు సమావేశాల అనంతరం  మజ్లిస్ పార్టీ తమ కార్యకలాపాలను ముమ్మరం చేసింది. ఓల్డ్ సిటీ కే పరిమితం ఆన్న ప్రచారానికి తెరదించే ప్రయత్నాలనుమజ్లీస్ మొదలు పెట్టింది. 

also read:తెరపైకి కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్: కేటీఆర్‌కు సీఎం పదవి?

మైనారిటీలకు ప్రతినిధిగా తమ పార్టీ అని చెప్పుకునే ఆ పార్టీ నేతలు రాష్ట్రం నలుమూలల నిరసనలను చేపడుతోంది.మజ్లీస్ ఆధ్వర్యంలో మైనారిటీ సంఘాలన్నీ ఏకమయ్యాయి. దేశ వ్యాప్తంగా భారీ బహిరంగ సభలు నిర్వహిస్తూ మైనారిటీల మద్దతు  కూడగట్టుకునే పనిలో  మజ్లిస్ పార్టీ కసరత్తు చేస్తోంది.

Also read: వీక్లీ రౌండప్: మంత్రుల మెడకు మున్సిపల్ ఉచ్చు, కేటీఆర్‌కు సీఎం పదవి?

 కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ భారీ బహిరంగ సభలు నిర్వహిస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల తెచ్చిన క్యాబ్ ఎన్ పి ఆర్,  ఎన్ అర్ సి బిల్లు లోని అంశాలను వ్యతిరేకిస్తున్నారు. రాజ్యాంగ విరుద్ధంగా  కేంద్రం వ్యవహరిస్తోందని విమర్శలు గుప్పిస్తున్నారు. 

Also read:వీక్లీ రౌండప్:దిశ నిందితుల మృతదేహాలకు రీపోస్టుమార్టం, కరీంనగర్ కలెక్టర్‌ బదిలీ

ఎం ఐ ఎం చేస్తున్న నిరసనలకు తెలంగాణలో అధికార పార్టీ మద్దతు తెలుపుతోంది. ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ మైనారిటీ ప్రతినిధులతో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ తో భేటీ అనంతరం నిజామాబాద్లో జరిగిన బహిరంగ సభలో టిఆర్ఎస్ పార్టీ ప్రతినిధులు కూడా సభకు హాజరయ్యారు. 

Also read:రాజధాని రాజకీయం: అమరావతి భవితపై ఆందోళన, ముంచుతారా తేల్చుతారా?

అయితే కేంద్రం తెచ్చిన ఎన్ఆర్‌సీ, సీఏఏ  బిల్లులను వ్యతిరేకిస్తూ కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకున్నట్లే తెలంగాణ ప్రభుత్వం కూడా కేంద్రం బిల్లులను పరిగణనలోకి తీసుకోరాదని డిమాండ్ చేస్తుంది. ఎం ఐ ఎం.తో స్నేహపూర్వకంగా టిఆర్ఎస్ పార్టీ కొనసాగుతున్నా ఎంఐఎం డిమాండ్లుకు టిఆర్ ఎస్ అంగీకారం తెలిపే అవకాశం కనిపించడం లేదు.

అయితే శనివారం హైదరాబాద్లో మైనారిటీ లో నిర్వహించిన భారీ ర్యాలీ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ పార్టీ శాంతియుతంగా నిరసనలు చేస్తామన్నా అనుమతినివ్వని పోలీసులు మైనారిటీలు చేసిన భారీ ర్యాలీకి  ఎలా అనుమతి ఇస్తారని కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు