పౌరసత్వ సవరణ చట్టంపై ఒవైసీ నిరసన: పాతబస్తీలో తిరంగా ర్యాలీ
కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), జాతీయ పౌర పట్టిక (ఎన్ఆర్‌సీ)కి వ్యతిరేకంగా ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఆందోళనకు దిగారు
కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), జాతీయ పౌర పట్టిక (ఎన్ఆర్‌సీ)కి వ్యతిరేకంగా ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఆందోళనకు దిగారు. శుక్రవారం హైదరాబాద్ పాతబస్తీలో యునైటెడ్ ముస్లిం యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో అసదుద్దీన్‌తో పాటు పాతబస్తీకి చెందిన ముస్లింలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పాతబస్తీ, మెహదీపట్నం, మల్లేపల్లి, మలక్‌పేట, ముషీరాబాద్, నాంపల్లి సహా పలు బస్తీల నుంచి జనం మీర్ ఆలం దర్గా వద్దకు చేరుకున్నారు.
అక్కడి నుంచి ర్యాలీగా హసన్‌నగర్, ఆరాంఘర్, మైలార్‌దేవ్‌పల్లి, శాస్త్రిపురం, కింగ్స్ కాలనీ, బాబా కాంటా వరకు ర్యాలీ జరిగింది. జనవరి 26 తర్వాత కూడా ఎన్ఆర్‌సీ, సీఏఏలకు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతాయని ఒవైసీ తెలిపారు.