దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ అత్యాచారం ఘటనలో దోషులకు ఉరి శిక్ష అమలుపై సుప్రీంకోర్టు కాసేపట్లో కీలక తీర్పు వెలువరించనుంది. ఈ కేసులో కోర్టు విధించిన ఉరిశిక్షను యావజ్జీవంగా  మార్చాలని ముగ్గురు దోషులు ముఖేష్, పవన్, వినయ్ శర్మలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై కాసేపట్లో తీర్పు వెలువడనుంది. మరో దోషి అక్షయ్ కుమార్ మాత్రం రివ్యూ పిటీషన్ దాఖలు చేయలేదు. 2012 డిసెంబర్ 16న నిర్భయను ఆరుగురు వ్యక్తులు అత్యంత దారుణంగా అత్యాచారం చేసి చంపేశారు. వీరిలో డ్రైవర్ రామ్ సింగ్ ఆత్మహత్య చేసుకోగా…మరో మైనర్ బాలుడికి మూడేళ్ల జైలు శిక్ష విధించారు. మిగిలిన నలుగురికి గతేడాది మేలో ఉరిశిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది.