Gwalior | ఉద్యోగులను ఉరి తీస్తానంటూ కలెక్టర్ వార్నింగ్.. వైరలవుతున్న వీడియో
Gwalior: ఇటీవలి కాలంలో రాజకీయ నేతలు, ఉన్నత స్థాయి అధికారులు కింద స్థాయి ఉద్యోగులను బెదిరింపులకు గురిచేస్తూ.. వార్నింగులు ఇస్తున్న ఘటనలు పెరుగుతున్నాయి. ఇదే నేపథ్యంలో ఉద్యోగులను ఉరితీస్తానంటూ ఓ కలెక్టర్ వార్నింగ్ ఇచ్చాడు. మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ కలెక్టర్ చేసిన ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ మారింది.
Gwalior: ఇటీవలి కాలంలో ఉన్నతాధికారులు కింద స్థాయి ఉద్యోగులను బెదిరింపులకు గురిచేస్తున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఉరితీస్తానంటూ కిందిస్థాయి ఉద్యోగులకు కలెక్టర్ వార్నింగ్ ఇచ్చాడు. దీనికి సంధించిన వీడియో ప్రస్తుతం షోషల్ మీడియాలో వైరల్ గా మారింది. విధులు సరిగా నిర్వహించకుంటే ఉరితీస్తానంటూ కలెక్టర్ వార్నింగ్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకెళ్తే.. జిల్లాలో వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను సరిగా నిర్వహించడం లేదంటూ మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ జిల్లా కలెక్టర్ కౌశలేంద్ర విక్రమ్‌సింగ్ ప్రభుత్వ ఉద్యోగులపై మండిపడ్డారు. భితర్వార్ రెవెన్యూ కార్యాలయంలో మంగళవారం నాడు కలెక్టర్ కౌశలేంద్ర విక్రమ సింగ్ నేతృత్వంలో ఓ సమావేశం జరిగింది. ఇందులో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. కరోనా మహమ్మారి వ్యాక్సినేషన్ లక్ష్యాలను అందుకోవడంలో విఫలమయ్యారని ఉద్యోగులపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన తీవ్ర ఆగ్రహానికి లోనైన కలెక్టర్ ఉద్యోగులను ఉరి తీస్తానంటూ వార్నింగ్ ఇచ్చాడు.
Also Read: Punjab polls | కేజ్రీవాల్ తిరంగా యాత్ర.. పంజాబ్‌లో కాకరేపుతున్న రాజకీయం !
ఈ సమావేశంలో గ్వాలియర్ కలెక్టర్ కౌశలేంద్ర విక్రమ్ సింగ్ మాట్లాడుతూ.. "కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియలో నిర్లక్ష్యం వహించకూడదు. ఏ ఒక్కరోజు కూడా టీకాలు అందించడంలో ఆలస్యం చేయకూడదు. అలా చేస్తే మిమ్మల్ని ఉరితీస్తా. కరోనా వైరస్ టీకాలు తీసుకోకుండా ఎవరూ ఉండకూడదు" అని అన్నారు. అలాగే, కరోనా టీకాల గురించి ప్రజల్లో ఉన్న భయాందోళనలు తొలగించడానికి చర్యలు తీసుకోవాలని అన్నారు. కోవిడ్-19 టీకాలు తీసుకొని ప్రజల వద్దకు వెళ్లి వారిని వ్యాక్సిన్లు తీసుకునేలా ప్రొత్సహించాలని అన్నారు. కరోనా వ్యాక్సిన్లు తీసుకోవాలని అభ్యర్థించాలన్నారు. "కరోనా టీకాలు వేయడం కోసం ప్రజల వద్దకు వెళ్లండి. వారి ఇండ్లకు వెళ్లండి. పంట పొలాల దగ్గరకు సైతం వెళ్లండి. టీకాలు తీసుకోని వారికి వ్యాక్సిన్లు ఇవ్వండి. వారు దీనికి అంగీకరించకపోతే.. వారికి ఉన్న అపోహలు తొలగించండి. అవసరమైతే అభ్యర్థించండి. వారు కరోనా టీకాలు తీసుకునే వరకు ప్రయత్నాలు ఆపకండి. టీకాలు తీసుకోని వారి ఇండ్ల ముందు రోజంతా వేచి ఉండండి. ఏదైనా చెయ్యండి.. వ్యాక్సినేషన్ మాత్రం పూర్తికావాలి" అని కలెక్టర్ ఉద్యోగులతో అన్నారు.
Also Read: Mamatha Banerjee: కమలం ఖతమే.. గోవాలో దూకుడు పెంచిన మమతా బెనర్జీ!
మధ్యప్రదేశ్ గ్వాలియర్ కలెక్టర్ కౌశలేంద్ర విక్రమ్ సింగ్ చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియలో తెగ హల్‌చల్ చేస్తోది. ఈ నేపథ్యంలోనే పలువురు మీడియా రిపోర్టర్లు దీనిపై కలెక్టర్‌ను ప్రశ్నించగా.. కరోనా వైరస్ వ్యాక్సినేషన్ లక్ష్యాలను చేరుకోకపోతే సస్పెండ్ చేస్తాననీ, తగిన చర్యలు తీసుకుంటానని మాత్రమే తాను హెచ్చరించినట్లు పేర్కొన్నారు. ఇదిలావుండగా, ఈ ఏడాది డిసెంబర్ చివరి నాటికి రాష్ట్రంలోని అర్హులైన ప్రతి ఒక్కరికి టీకా అందిస్తామని మధ్యప్రదేశ్ ప్రభుత్వం గతంలోనే వెల్లడించింది. దీనికి తగినట్టుగా అధికార యంత్రాగాన్ని పరుగులు పెట్టిస్తోంది. కలెక్టర్ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. దీనిపై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలావుండగా, మధ్యప్రదేశ్ లో ఇప్పటివరకు మొత్తం 7,93,415 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. అలాగే, 10,529 మంది కోవిడ్-19 కారణంగా ప్రాణాలు కోల్పోయారు.
Also Read: Revanth Reddy | తెలంగాణలో రైతన్నల మరణమృదంగం మోగుతోంది.. ప్రభుత్వంపై రేవంత్ ఫైర్