Asianet News TeluguAsianet News Telugu

Punjab polls | కేజ్రీవాల్ తిరంగా యాత్ర‌.. పంజాబ్‌లో కాక‌రేపుతున్న రాజ‌కీయం !

Punjab polls: వ‌చ్చే ఏడాది ప్రారంభంలో పంజాబ్‌లో అసెబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలో రాష్ట్రంలో రాజ‌కీయ పార్టీల‌న్ని ముమ్మ‌రంగా ఎన్నిక‌ల ప్ర‌చారం చేస్తున్నాయి. రాజ‌కీయ పార్టీల నేత‌లు విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌ల‌తో విరుచుకుప‌డుతుండ‌టంతో ఒక్క‌సారిగా రాజ‌కీయాలు కాక‌రేపుతున్నాయి. మ‌రీ ముఖ్యంగా కేజ్రీవాల్ తిరంగా యాత్ర రాష్ట్ర రాజ‌కీయాల్లో హీట్ పెంచింది. 
 

Punjab polls: Kejriwal promises international airport in Jalandhar
Author
Hyderabad, First Published Dec 16, 2021, 9:51 AM IST

Punjab polls: 2022 ప్రారంభంలో దేశంలోని ప‌లు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గున్నాయి. ఆయా రాష్ట్రాల్లో ఇప్పుడే రాజీయాలు వేడేక్కాయి. ముఖ్యంగా పంజాబ్‌లో రాజ‌కీయాలు ర‌స‌వ‌త్త‌రంగా  మారాయి. తాజాగా ఎన్నిక‌ల ప్ర‌చార శంఖారావాన్ని పూరించిన ఢిల్లీ ముఖ్య‌మంత్రి ఆర‌వింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ త్రివ‌ర్ణ ప‌తాకాన్ని చేత‌బూని.. భార‌త్ మాతాకీ జై అంటూ నినాదాలు చేస్తూ తిరంగా యాత్ర‌ను ప్రారంభించింది. ఆప్ భారీ ర్యాలీ నిర్వ‌హించడంతో జ‌లంధ‌ర్ న‌గ‌రం మొత్తం త్రివ‌ర్ణ ప‌తాకాలు, భార‌త్ మాతాకీ జై నినాదాల‌తో మారుమోగిపోయింది. దేశ‌భ‌క్తిని వ‌ర్ణాన్ని పూయించింది.  పంజాబ్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా ఆ రాష్ట్రంలో రెండు రోజుల ప‌ర్య‌ట‌న‌లో ఉన్న సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ ఈ ఎన్నిక‌ల ప్ర‌చారం ర్యాలీలో మాట్లాడుతూ ఓట‌ర్ల‌ను త‌మ‌పైపు తిప్పుకునేందుకు ప‌లు హామీలు ప్ర‌క‌టించారు. అలాగే, రాష్ట్రంలోని ఇత‌న పార్టీల‌పై విమ‌ర్శ‌ల‌తో విరుచుకుప‌డ్డారు. 

Also Read: Mamatha Banerjee: క‌మ‌లం ఖ‌త‌మే.. గోవాలో దూకుడు పెంచిన మమతా బెనర్జీ!

కేజ్రీవాల్ మాట్లాడుతూ.. "ఇది అద్భుతమైన త్రివర్ణ ఊరేగింపు. జలంధర్ ప్రజలు మాపై చాలా ప్రేమను కురిపించారు. పంజాబ్‌ను సుభిక్షంగా మార్చాలనుకుంటున్నాం. ఇక్కడ శాంతి, సౌభ్రాతృత్వం నెలకొల్పడం ద్వారా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం" అని అన్నారు. అలాగే, తాము అధికారంలోకి వ‌స్తే అనేక అభివృద్ధి కార్య‌క్ర‌మాలు చేప‌డుతామ‌న్న కేజ్రీవాల్‌..  2022లో పంజాబ్‌లో ఆప్ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వ‌త జలంధర్‌లో భారతదేశంలోనే అతిపెద్ద క్రీడా విశ్వవిద్యాలయాన్ని నిర్మిస్తామ‌ని హామీ ఇచ్చారు. ఎన్ఆర్ఐల‌కు బ‌ల‌మైన కోట‌గా ఉన్న దోబాలోని ప్రజలు విమాన ప్ర‌యాణాల కోసం ఢిల్లీ, ఛండీగ‌ఢ్‌, అమృత్‌సర్‌లకు వెళ్లాల్సి వ‌స్తున్న‌ద‌ని కేజ్రీవాల్ అన్నారు. అయితే, తాము అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌... వారు విమాన ప్ర‌యాణాల కోసం ఎక్కువ దూరం వెళ్లాల్సిన ప‌నిలేద‌న్నారు. ఆప్ స‌ర్కారు జ‌లంధ‌ర్‌లోనే అత్యాధునిక హంగుల‌తో జ‌లంధ‌ర్‌లో అంత‌ర్జ‌తీయ విమానాశ్ర‌యం నిర్మిస్తుంద‌ని హామీ ఇచ్చారు.  అలాగే, ఈ ర్యాలీలో పాల్గొన్న ప‌లువురు పిల్ల‌లు త‌మ పిగ్గీ బ్యాంకు డ‌బ్బుల‌ను ఆప్‌కు విరాళంగా సీఎం కేజ్రీవాల్ కు అందించారు. 

Also Read: Revanth Reddy | తెలంగాణలో రైత‌న్న‌ల‌ మరణమృదంగం మోగుతోంది.. ప్ర‌భుత్వంపై రేవంత్ ఫైర్

ఇదిలావుండగా, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ కాంగ్రెస్ పార్టీని వీటి ఇటీవ‌లే కొత్త పార్టీని ఏర్పాటు చేసిన సంగ‌తి తెలిసిందే. ఎలాగైన రాష్ట్రంలో అధికారా చేజిక్కించుకోవాల‌ని చూస్తున్న అమ‌రీంద‌ర్ ఇప్ప‌టికే ఎన్నిక‌ల ప్ర‌చారంలో వేగం పెంచ‌డంతో పాటు పొత్తుల కోసం ఇత‌ర పార్టీల‌తో ముమ్మ‌రంగా చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు. ఇటీవ‌లే ప‌లువురు బీజేపీ నేత‌ల‌తో చ‌ర్చ‌లు కొన‌సాగించారు. ఇక బుధ‌వారం నాడు పంజాబ్ రాష్ట్ర  ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీని లక్ష్యంగా చేసుకుని తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు.  రాష్ట్రంలో పోలీసు అధికారుల పోస్టింగ్ విష‌యాల్లో అక్ర‌మాలు జ‌రిగాయ‌ని ఆరోపించిన ఆయ‌న‌.. ఈ స‌మ‌స్య‌పై ఎందుకు విచార‌ణ జ‌రిపించ‌డం లేద‌ని ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించారు. రాష్ట్రంలోని సీనియర్‌ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌, డిప్యూటీ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ నియామకాల్లో అవినీతికి పాల్పడ్డారంటూ తన మంత్రివర్గ సహచరుడు తీవ్ర ఆరోపణలు చేసినపుడు  దానిపై ఎందుకు విచార‌ణ జ‌రిపించ‌డం లేదు. ఈ విష‌యంలో ప్ర‌భుత్వ నేత‌లకు ముడుపులు అందాయ‌ని అమ‌రీంద‌ర్ ఆరోపించారు. ఈ ఆరోపణలపై విచారణ జరిపించాలని అకాలీదళ్ కూడా డిమాండ్ చేసింది. ఇదిలావుండ‌గా, అకాలీ సీనియర్ నాయకుడిపై కొన్ని డ్రగ్స్ కేసుల్లో పునర్విచారణకు కొన్ని చట్టపరమైన అడ్డంకులు ఉన్నాయని పేర్కొంటూ సీనియర్ పోలీసు అధికారి రాసిన లేఖ లీక్ కావడంపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని చన్నీ మంగళవారం ఆదేశించారు.

Also Read: MLC Elections | అధికార పార్టీ టీఆర్ఎస్‌లో క్రాస్ ఓటింగ్ క‌ల‌వ‌రం !

Follow Us:
Download App:
  • android
  • ios